Share News

Rohit-Kohli: కుల్దీప్‌పై రోహిత్-కోహ్లీ బూతుల వర్షం.. అసలు తప్పు ఎవరిది

ABN , Publish Date - Mar 05 , 2025 | 10:43 AM

Kuldeep Yadav: చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సీరియస్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కడ్ని టార్గెట్ చేసి ఇద్దరూ బూతుల దండకం అందుకోవడంపై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరిది? అనేది ఇప్పుడు చూద్దాం..

Rohit-Kohli: కుల్దీప్‌పై రోహిత్-కోహ్లీ బూతుల వర్షం.. అసలు తప్పు ఎవరిది
ICC Champions Trophy Semi Final

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనకు బాగా గురి, నమ్మకం ఉన్న కొందరు ఆటగాళ్ల మీద భరోసా ఉంచి వాళ్లు ఫెయిలైనా కంటిన్యూ చేస్తుంటాడు. అలా అతడి ప్రోత్సాహంతో ఎదిగిన ఆటగాళ్లలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒకడు. కుల్దీప్‌ను సపోర్ట్ చేస్తూ అతడు స్టార్‌గా మారడంలో హిట్‌మ్యాన్ కీలక పాత్ర పోషించాడు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా. అలాంటిది చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో కుల్దీప్‌పై రోహిత్ బూతుల దండకం అందుకున్నాడు. అతడితో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా స్పిన్నర్‌ను తిట్టాడు. అసలు కుల్దీప్‌ను ఇద్దరూ తిట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? ఈ కాంట్రవర్సీలో ఎవరిది తప్పు? అనేది ఇప్పుడు చూద్దాం..


తప్పు మీద తప్పు

సెమీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఆసీస్‌ను కంగారు పెట్టారు. అయితే ఒక్క కుల్దీప్ మాత్రం అటు వికెట్లు తీయకపోగా.. పరుగులను కూడా నియత్రించలేకపోయాడు. చెత్త బంతులు వేస్తూ రన్స్ ఈజీగా లీక్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్లు సెటిల్ అయ్యేలా చేశాడు. దీంతో రోహిత్ అతడి మీద కోపంగా ఉన్న తరుణంలోనే 32వ ఓవర్‌లో కుల్దీప్ మరో తప్పు చేశాడు. అతడి బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ కొట్టిన బంతిని కోహ్లీ అందుకున్నాడు. రనౌట్ కోసం నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వైప్ బంతి విసిరాడు. కానీ అక్కడే ఉన్న కుల్దీప్ దాన్ని అందుకోలేదు. వెనకే ఉన్న రోహిత్ బాల్‌ను ఆపాడు. దీంతో బాల్ పట్టకుండా ఏం చేస్తున్నావంటూ.. ఒకవైపు నుంచి కోహ్లీ, మరోవైపు నుంచి రోహిత్ బూతుల దండకం అందుకున్నారు. దీంతో కుల్దీప్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఇవీ చదవండి:

ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు: రాహుల్

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ సీరియస్

డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2025 | 03:17 PM