Ravindra Jadeja: టీమిండియా కొంపముంచిన జడేజా.. మజాక్ మజాక్‌ల రజాక్ అంటే ఇదే
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:10 PM
Marnus Labuschagne: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాను చిక్కుల్లో పడేశాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. అతడు సరదాగా చేసిన ఒక పని భారత్‌కు తీవ్ర ముప్పు తెచ్చేలా ఉంది. అసలు జడ్డూ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఒక్కోసారి సరదా సరదాగా చేసే పనుల వల్ల లేనిపోని చిక్కుల్లో పడతాం. ఫన్నీ ఇన్సిండెంట్స్ వల్ల అనవసర సమస్యలు కొనితెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కావాలని చేయకపోయినా చిక్కుల్లో పడి ఇబ్బందులు పడటం కామనే. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో అదే జరిగింది. అతడు సరదాగా చేసిన ఒక తుంటరి పనితో లేనిపోని సమస్యలను పీకల మీదకు తెచ్చుకున్నాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఊపు మీదున్న టీమిండియాకు జడ్డూ ఇష్యూ ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఇది కాస్త అటూ ఇటైనా ఫైనల్‌కు ముందు రోహిత్ సేనకు గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు జడేజా కాంట్రవర్సీ ఏంటి? అందులో అతడి తప్పేంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
గట్టిగా పట్టుకొని..
నాకౌట్ మ్యాచ్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌తో వార్తల్లోకి ఎక్కాడు జడేజా. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 21వ ఓవర్ వేసేందుకు వచ్చాడీ స్టార్ స్పిన్నర్. అప్పుడు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌తో పాటు సీనియర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ క్రీజులో ఉన్నాడు. జడ్డూ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ ఎదురుగా కొట్టాడు. అది కాస్త ఉంటే నాన్ స్ట్రయికర్ లబుషేన్ బ్యాట్‌కు తగిలేది. ఇది గమనించిన జడేజా లబుషేన్‌ను గట్టిగా పట్టుకున్నాడు. అతడ్ని రన్ తీయకుండా నిరోధించాడు. ఇదే ఇప్పుడు అతడికి ఇబ్బందికరంగా మారింది.
రూల్స్ ఏం చెబుతున్నాయి..
సింగిల్ తీయొద్దనే ఉద్దేశంతో లబుషేన్‌ను జడేజా అడ్డుకోలేదు. సరదాగా అతడ్ని ఆపాడు. గట్టిగా పట్టుకొని నవ్వుతూ కనిపించాడు. లబుషేన్ కూడా దీన్ని ఫన్నీగానే తీసుకున్నాడు. కానీ స్ట్రయికర్ స్మిత్ మాత్రం సీరియస్ అయ్యాడు. రన్ తీయకుండా అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో జడ్డూపై ఫిర్యాదు చేస్తూ మ్యాచ్ రిఫరీకి ఆసీస్ కంప్లయింట్ చేసే చాన్స్ ఉందని వినిపిస్తోంది. ఐసీసీ రూల్స్ ప్రకారం.. బ్యాటర్‌ను బౌలర్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే నేరంగా పరిగణిస్తారు. తప్పు చేశాడని రుజువైతే జరిమానా విధించడం లేదా మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించడం లాంటివి చేస్తారు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ తరుణంలో ఒకవేళ కంగారూలు నిజంగా కంప్లయింట్ చేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది తెలిసిన నెటిజన్స్.. జడ్డూ మజాక్ మజాక్‌ల రజాక్ అయిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం
కుల్దీప్‌పై రోహిత్-కోహ్లీ బూతుల వర్షం
ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు: రాహుల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి