Share News

IPL 2024: SRHపై RCB గెలిచినా నో చేంజ్.. కానీ ప్లేఆఫ్ రేసులో..

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:18 AM

ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)ను 35 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ గెలిచినా కూడా పాయింట్ల పట్టికలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

IPL 2024: SRHపై RCB గెలిచినా నో చేంజ్.. కానీ ప్లేఆఫ్ రేసులో..
ipl 2024 No change in points table even if RCB

ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)ను 35 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు నిర్ణీత వ్యవధిలో అన్ని వికెట్లు కోల్పోయి, చివరికి 20 ఓవర్లలో 171-8 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. బెంగళూరు తరఫున స్పిన్ బౌలర్లు కరణ్ శర్మ, శ్వప్నిల్ సింగ్, పేసర్ కామెరాన్ గ్రీన్ రెండేసి వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.


మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)లో షాబాజ్ అహ్మద్ 40 (37) మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్లు కూడా ఎక్కువ పరుగులు చేయలేక పోయారు. అయితే ఈ విజయంతో RCB జట్టు ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక ఐపీఎల్ 2024లో హైదరాబాద్‌కు ఇది మూడో ఓటమి కాగా, RCB జట్టుకు రెండో విజయం. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే RCB జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే. దీంతో అందరి దృష్టి RCB జట్టుపై ఉండగా, ఎట్టకేలకు విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.


ఇక సన్‌రైజర్స్(SRH) బ్యాటింగ్ లైనప్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు మూడుసార్లు 250 మార్క్‌ను దాటింది. చివరిసారి RCBతో సన్‌రైజర్స్ తలపడినప్పుడు, మొదట బ్యాటింగ్ చేసిన వారు 287 పరుగుల స్కోరును చేశారు. కానీ నిన్నటి మ్యాచులో మాత్రం గెలుపొందలేకపోయారు. మరోవైపు RCB హైదరాబాద్ జట్టుపై గెలిచినప్పటికి పాయింట్ల పట్టికలో మాత్రం చివరి స్థానంలోనే ఉంది. SRH మాత్రం 8 మ్యాచుల్లో 5 గెలిచి పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


ఇది కూడా చదవండి:

రైజర్స్‌ కు ముకుతాడు


CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం


Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 07:22 AM