Share News

బీసీసీఐ కార్యదర్శిగా రోహన్‌ జైట్లీ?

ABN , Publish Date - Aug 27 , 2024 | 05:18 AM

బీసీసీఐ కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీపడడం దాదాపు ఖాయమైంది. ఈనేపథ్యంలో ఖాళీ అవనున్న బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరికి....

బీసీసీఐ కార్యదర్శిగా రోహన్‌ జైట్లీ?

న్యూఢిల్లీ: బీసీసీఐ కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీపడడం దాదాపు ఖాయమైంది. ఈనేపథ్యంలో ఖాళీ అవనున్న బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ ప్రముఖ నేత, దివంగత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుమారుడే రోహన్‌. డీడీసీఏ చీఫ్‌గా 14 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించిన అరుణ్‌ జైట్లీ.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

Updated Date - Aug 27 , 2024 | 05:19 AM