Viral Video: ఐపీఎల్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై? చాట్ వీడియో వైరల్
ABN, Publish Date - May 11 , 2024 | 01:04 PM
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్(MI) జట్టు ప్లేఆఫ్ రేసులో లేదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నేటి మ్యాచ్‌కు ముందు తన పాత స్నేహితుడిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో KKR జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్(Abhishek Nayar)తో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపిస్తోంది.
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్(MI) జట్టు ప్లేఆఫ్ రేసులో లేదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నేటి మ్యాచ్‌కు ముందు తన పాత స్నేహితుడిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో KKR జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్(Abhishek Nayar)తో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపిస్తోంది. ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ వారి సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేసింది. అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో నెట్టింట రోహిత్ శర్మ సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
వైరల్ వీడియోలో అభిషేక్ నాయర్(Abhishek Nayar)తో రోహిత్ ఇలా అన్నారు. ఇప్పుడు ముంబై మునుపటిలా ఏమీ లేదు, ప్రతిదీ మారిపోయింది. ఇది నేను నిర్మించిన ఆలయం. ఏది ఏమైనా, ఇదే నా ఇల్లు, నా సోదరుడు. ఇవేమి నేను పట్టించుకోను. ఇది నా చివరి సంవత్సరం అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన పలువురు ఔనని అంటుండగా, మరికొంత మంది మాత్రం అలాంటిది ఏమి ఉండదని చెబుతున్నారు.
రోహిత్ శర్మ మాటలను బట్టి చూస్తే రోహిత్ ముంబై ఇండియన్స్ కోసం చివరిసారిగా IPL ఆడుతున్నాడని, T20 ప్రపంచ కప్ తర్వాత T20 లేదా T20 క్రికెట్ నుంచి కెప్టెన్సీని వదిలివేయవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత రోహిత్ టెస్ట్ క్రికెట్, ODI క్రికెట్‌పై దృష్టి పెట్టవచ్చని క్రీడా వర్గాలు అంటున్నాయి.
ముంబై ఇండియన్స్(MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఐపీఎల్ సీజన్ అంత బాగాలేదని చెప్పవచ్చు. అతను బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు ఆడి పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ జట్టు శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్(KKR)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ KKR కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతూ కనిపించారు. ఈ సందర్భంగా రోహిత్ సంభాషణ అభిమానుల్లో టెన్షన్ పెంచింది. రోహిత్ శర్మ, అభిషేక్ మధ్య సంభాషణ మొత్తం స్పష్టంగా లేదు. ఈ క్రమంలో వీడియోలో వినిపించిన దాని గురించి అభిమానులు భిన్నమైన అంచనాలు వేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Viral Video: మ్యాచ్ మధ్యలో పరిగెత్తుకెళ్లి ధోని కాళ్లపై పడిన వీరాభిమాని
IPL GT VS CSK : టైటాన్స్ రేసులోనే
Read Latest Sports News and Telugu News
Updated Date - May 11 , 2024 | 01:58 PM