Share News

IND vs BAN: సరికొత్త రికార్డ్‌కి అడుగు దూరంలో రోహిత్.. అదేంటంటే..?

ABN , Publish Date - Sep 11 , 2024 | 01:14 PM

Rohit Sharma: భారత క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..

IND vs BAN: సరికొత్త రికార్డ్‌కి అడుగు దూరంలో రోహిత్.. అదేంటంటే..?
Rohit Sharma

Rohit Sharma: భారత క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. ఈ టార్గెట్ ఫినిష్ చేస్తే టెస్టుల్లో భారత్ తరఫున సిక్సర్ల రారాజుగా నిలవనున్నాడు హిట్ మ్యాన్‌.


7 సిక్సర్లు కొడితే సేహ్వాగ్ రికార్డ్ బ్రేక్..

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ 7 సిక్సర్లు కొడితే భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా హిట్ మ్యాన్ రికార్డులకెక్కుతాడు. భారత్ తరఫున 103 టెస్టు మ్యాచ్‌లు ఆడి 90 సిక్సర్లు బాదిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను రోహిత్ శర్మ బీట్ చేస్తాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటివరకు 59 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 84 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ 78 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో, రవీంద్ర జడేజా ఐదో స్థానంలో ఉన్నారు.


టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయులు..

  • వీరేంద్ర సెహ్వాగ్ – 178 ఇన్నింగ్స్‌ల్లో 90 సిక్సర్లు

  • రోహిత్ శర్మ – 101 ఇన్నింగ్స్‌ల్లో 84 సిక్సర్లు

  • ఎంఎస్ ధోని – 144 ఇన్నింగ్స్‌ల్లో 78 సిక్సర్లు

  • సచిన్ టెండూల్కర్ – 329 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు

  • రవీంద్ర జడేజా – 105లో 64 సిక్సర్లు.


అంతర్జాతీయ స్థాయిలో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ ప్లేయర్స్ వీరే..

టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. బెన్ స్టోక్స్ ఇప్పటివరకు 190 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 131 సిక్సర్లు బాదాడు. అతని తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (176 ఇన్నింగ్స్‌ల్లో 107 సిక్స్‌లు), ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ (137 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్స్‌లు) ఉన్నారు.

రికార్డులకు కేరాఫ్ హిట్ మ్యాన్..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. అతను మూడు ఫార్మాట్‌లతో కలిపి మొత్తం 483 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో మొత్తం 620 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ రోహిత్ శర్మ. 159 టీ20 మ్యాచ్‌ల్లో రోహిత్ 205 సిక్సర్లు బాదాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. 265 వన్డేలు ఆడిన రోహిత్‌ పేరిట 331 సిక్సర్లు ఉన్నాయి.


భారత్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల వివరాలు..

  • మొదటి టెస్ట్ - చెన్నై - సెప్టెంబర్ 19 నుండి 23వ తేదీ వరకు.

  • రెండవ టెస్ట్ - కాన్పూర్ - 27 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1 వరకు.

  • మొదటి T20 - గ్వాలియర్ - అక్టోబర్ 6వ తేదీన.

  • రెండవ T20 - ఢిల్లీ - అక్టోబర్ 9వ తేదీన.

  • మూడవ T20 - హైదరాబాద్ - అక్టోబర్ 12వ తేదీన.


Also Read:

తెలంగాణ కేబినెట్ విస్తరణకు వెళాయే? రేసులో ఉన్నది వీరే

ఇలా పెట్టుబడి చేస్తే గ్యారంటీ ఇన్‌కమ్.. కోటీశ్వరులవ్వడం ఖాయం..

ఏపీలో కృష్ణా నదికి ఎన్నడూ రానంత వరద..

For More Cricket News and Telugu News..

Updated Date - Sep 11 , 2024 | 01:14 PM