IPL 2024: అదరగొట్టిన కోల్ కతా బ్యాట్స్‌మెన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?
ABN, Publish Date - Apr 21 , 2024 | 05:30 PM
ఐపీఎల్‌లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
ఐపీఎల్‌లో (IPL) పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ ఓపెనర్లుగా వచ్చారు. 14 బంతుల్లో సాల్ట్ 48 రన్స్ చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. సునీల్ నరైన్ నిరాశ పరిచాడు. 15 బాల్స్ ఆడి కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. రఘువంశీ, వెంకటేష్ అయ్యర్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాణించాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. రింకు సింగ్ కూడా నిరాశ పరిచాడు. 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచింది. కామెరూన్ గ్రీన్, యాష్ దయాల్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, ఫెర్గుసన్ ఒక్కో వికెట్ తీశారు.
IPL 2024: ఐపీఎల్‌లో అరుదైన మైలురాయి చేరుకున్న దినేశ్ కార్తీక్
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం
Updated Date - Apr 21 , 2024 | 05:37 PM