Share News

T20 Worldcup: మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ అద్భుత విన్యాసం చూడండి..

ABN , Publish Date - Jun 30 , 2024 | 07:31 AM

ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్. దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం. క్రీజులో అరవీర భయంకర డేవిడ్ మిల్లర్. చివరి ఓవర్ వేసేందుకు హార్దిక్ బంతి అందుకున్నాడు. హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ బలంగా కొట్టాడు. అది కచ్చితంగా సిక్స్ వెళ్లేలా కనిపించింది.

T20 Worldcup: మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ అద్భుత విన్యాసం చూడండి..
Surya kumar yadav Catch

ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ (India vs SouthAfrica). దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం. క్రీజులో అరవీర భయంకర డేవిడ్ మిల్లర్. చివరి ఓవర్ వేసేందుకు హార్దిక్ బంతి అందుకున్నాడు. హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ బలంగా కొట్టాడు. అది కచ్చితంగా సిక్స్ వెళ్లేలా కనిపించింది. ఆ సమయంలో వైడ్ లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav ) మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అద్భుతంగా బంతి అందుకున్నాడు.


అంత వేగంతో పరిగెత్తుకుంటూ రావడంతో నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ అవతలకు వెళ్లిపోయాడు. అంతలోనే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి బౌండరీ లైన్ లోపలికి వచ్చి ఆ బంతిని పట్టుకున్నాడు (Surya kumar yadav Catch). అంత ఒత్తిడి సమయంలో కూడా సమయోచితంగా ఆలోచించిన సూర్యకుమార్ టీమిండియా విజయానికి అవసరమైన సూపర్ క్యాచ్ తీసుకున్నాడు.


నిజానికి ఈ క్యాచే మ్యాచ్‌ను మలుపుతిప్పిందని చెప్పాలి. ఎందుకంటే హార్డ్ హిట్టర్ అయిన మిల్లర్ క్రీజులో ఉంటే 6 బంతుల్లో 16 పరుగులు కొట్టడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన సూర్య అద్భుతమైన క్యాచ్ పట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated Date - Jun 30 , 2024 | 07:31 AM