Share News

T20 World Cup 2024: రేపు ఇండియా Vs పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌లో గెలుపెవరిది..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:02 PM

క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాంటి సంఘటన ఇప్పుడు మళ్లీ రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024(ICC T20 World Cup 2024)లో భాగంగా రేపు(జూన్ 9న) అమెరికాలోని న్యూయార్క్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఎవరు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

T20 World Cup 2024: రేపు ఇండియా Vs పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌లో గెలుపెవరిది..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే
India vs Pakistan T20 match 2024

క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాంటి సంఘటన ఇప్పుడు మళ్లీ రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024(ICC T20 World Cup 2024)లో భాగంగా రేపు(జూన్ 9న) అమెరికాలోని న్యూయార్క్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచులో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం.


టీమ్ ఇండియా సిద్ధం

పాకిస్తాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా(team india) పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీమ్ ఇండియా ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయంతో ప్రారంభించింది. ఆ క్రమంలో ఐర్లాండ్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించారు. అదే సమయంలో T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం పాకిస్తాన్‌కు చాలా ఘోరంగా ఉందని చెప్పవచ్చు. వీరు తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్‌లో 5 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌పై పాక్ జట్టు గెలవాలని చూస్తోంది. మరోవైపు టీమ్ ఇండియా కూడా రెండో విక్టరీ సాధించాలని భావిస్తోంది.


పాకిస్తాన్ చెత్త రికార్డ్

టీ20లో టీమ్ ఇండియాపై పాకిస్తాన్(Pakistan) రికార్డు చాలా దారుణంగా ఉంది. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్‌-పాకిస్తాన్ జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్‌లు జరగలేదు. కానీ ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరుగగా, 8 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ ఫార్మాట్‌లో పాకిస్తాన్ జట్టు టీమ్ ఇండియాను మూడుసార్లు మాత్రమే ఓడించగలిగింది. ఒక మ్యాచ్ ఇరు జట్ల మధ్య మ్యాచ్ టై అయింది. మరి రేపటి మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే రేపటి మ్యాచులో టీమ్ ఇండియా 69 శాతం గెలిచే అవకాశం ఉండగా, పాకిస్తాన్ జట్టుకు 31 శాతం ఉందని తెలిపింది.


ఓడించడం కష్టమేనా?

మరోవైపు పాకిస్తాన్‌(Pakistan)తో జరిగిన టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2024)లో కూడా టీమిండియా పూర్తిగా పైచేయి సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 7 మ్యాచ్‌లు జరుగగా, అందులో టీం ఇండియా 6 మ్యాచ్‌లు గెలిచింది. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి మాత్రమే భారత్‌ను పాకిస్తాన్ ఓడించింది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ ఫామ్ చూస్తుంటే టీమ్ ఇండియాను ఓడించడం కష్టమనే అనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

T20 World Cup USA Team ; అమెరికా స్టార్లు మనోళ్లే !

T20 World Cup Group A : కెనడా సంచలనం


For Latest News and Sports News click here

Updated Date - Jun 08 , 2024 | 01:05 PM