సెమీ్‌సలో రోహిదాస్ ఆడేనా?
ABN , Publish Date - Aug 05 , 2024 | 04:58 AM
బ్రిటన్‌తో క్వార్టర్స్ మ్యాచ్‌లో హాకీ స్టిక్‌తో ప్రత్యర్థి ముఖంపై కొట్టాడనే కారణంతో రెడ్‌కార్డ్‌కు గురైన భారత కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ తర్వాతి మ్యాచ్‌లో ఆడేది సందేహంగా మారింది....
బ్రిటన్‌తో క్వార్టర్స్ మ్యాచ్‌లో హాకీ స్టిక్‌తో ప్రత్యర్థి ముఖంపై కొట్టాడనే కారణంతో రెడ్‌కార్డ్‌కు గురైన భారత కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ తర్వాతి మ్యాచ్‌లో ఆడేది సందేహంగా మారింది. రెడ్‌కార్డ్‌కు గురవడంతో చివరి నలభై నిమిషాలు రోహిదాస్ లేకుండానే భారత్ మ్యాచ్ ఆడింది. అయితే హాకీలో రెడ్‌కార్డ్ నిబంధనలు ఫుట్‌బాల్‌లో మాదిరిగా ఉండవు. హాకీలో రెడ్‌కార్డ్‌కు గురైతే..మ్యాచ్ అనంతరం ఈ ఉదంతంపై అంపైర్ సాంకేతిక అధికారికి నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడతను ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలించి, సదరు ఆటగాడి చర్య ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అన్నది నిర్ణయిస్తాడు. ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు తేలితే, ఆ ఆటగాడిని తర్వాతి మ్యాచ్ నుంచి తప్పిస్తారు. అదే జరిగితే, తర్వాతి మ్యాచ్‌లో భారత్‌కు ఇది పెద్ద దెబ్బే.