Share News

Hacked: కెనరా బ్యాంక్ వినియోగదారులకు హై అలర్ట్.. ఎక్స్ అకౌంట్ హ్యాక్

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:52 PM

హ్యాకర్లు బ్యాంకుల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లనూ వదలట్లేదు. తాజాగా కెనరా బ్యాంక్ అధికారిక సోషల్ మీడియా(Canara Bank X account hacked) హ్యాండిల్ X అకౌంట్ హ్యాక్‌కి గురైంది. హ్యాకర్లు అధికారిక ఎక్స్ హ్యాండిల్ పేరును 'ether.fi'గా మార్చారు.

Hacked: కెనరా బ్యాంక్ వినియోగదారులకు హై అలర్ట్.. ఎక్స్ అకౌంట్ హ్యాక్

కెనరా: హ్యాకర్లు బ్యాంకుల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లనూ వదలట్లేదు. తాజాగా కెనరా బ్యాంక్ అధికారిక సోషల్ మీడియా(Canara Bank X account hacked) హ్యాండిల్ X అకౌంట్ హ్యాక్‌కి గురైంది. హ్యాకర్లు అధికారిక ఎక్స్ హ్యాండిల్ పేరును ether.fiగా మార్చారు.

ప్రస్తుతం కెనరా బ్యాంక్ అధికారిక ఖాతా(@canarabank) 2.55 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉంది. అయితే ఈ ఘటనపై కెనరా యాజమాన్యం ఇంకా స్పందించలేదు. హ్యాక్‌కి గురైన తరువాత మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎక్స్ అకౌంట్లో ఎలాంటి పోస్టులు చేయలేదు. జూన్ 17న యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ హ్యాండిల్ హ్యాక్‌కి గురైంది. ఇందులో బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాకు సంబంధించి కొన్ని పోస్ట్‌లు చేశారు.


“బ్యాంక్ అధికారిక హ్యాండిల్‌ని హ్యాక్ చేయడంపై దర్యాప్తు ప్రారంభించాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎక్స్ అకౌంట్ నుంచి చేసిన పోస్ట్‌లను నమ్మకండి. అనధికారిక లింక్‌లపై క్లిక్ చేయకండి. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, OTP, ATM పిన్ లేదా ఇతర వ్యక్తిగత వివరాలను బ్యాంక్ ఎప్పటికీ అడగదు. అప్రమత్తంగా ఉండండి” అని యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులను కోరింది.

For Latest News and National News click here

Updated Date - Jun 23 , 2024 | 04:52 PM