Share News

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై Google Drive బ్యాకప్ నిలిపివేత

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:09 PM

ఇకపై వాట్సాప్ యూజర్లకు కూడా బాదుడు మొదలు కానుంది. ఎందుకంటే వాట్సాప్ అపరిమిత చాటింగ్ Google Drive బ్యాకప్ సపోర్ట్ మరికొన్ని రోజుల్లో నిలిచిపోనుంది. ఇప్పటికే అనేక మంది యూజర్లకు అలర్ట్ కూడా వస్తుందని తెలిసింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై Google Drive బ్యాకప్ నిలిపివేత

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. బీటా అప్‌డేట్ కోసం సైన్ అప్ చేసిన వినియోగదారులకు ఇకపై Google డ్రైవ్‌లో అపరిమిత చాట్ బ్యాకప్ సపోర్ట్ నిలిపివేస్తుంది. ప్రధానంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులకు ఇకపై ఉచిత క్లౌడ్ నిల్వను అందించదని ఓ నివేదక ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది బీటా వర్షన్ యూజర్లను ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో Android స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులందరికీ Google Drive ఫ్రీ స్టోరేజ్ నిల్వ నిలిపివేయబడవచ్చని టెక్ నిఫుణులు అంటున్నారు.


ఈ నేపథ్యంలో పలువురు యూజర్లకు(users) యాప్ సెట్టింగ్‌లలో బ్యాకప్‌లో బ్యానర్‌ వస్తుంది. ఆ క్రమంలోనే వచ్చిన మార్పులు 30 రోజులలోపు అమలులోకి వస్తాయని వినియోగదారులకు తెలుపుతుంది. గత ఏడాది నవంబర్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ డ్రైవ్ అపరిమిత చాట్ బ్యాకప్‌ను కంపెనీలు ఆపబోతున్నట్లు వాట్సాప్, గూగుల్ ఇప్పటికే ప్రకటించడం విశేషం. చివరిసారి విడుదల చేసిన టైమ్‌లైన్ ప్రకారం ఈ మార్పు డిసెంబర్‌లో బీటా యూజర్ల కోసం 2024 ప్రథమార్థంలో ఇతర వినియోగదారులందరికీ విడుదల చేస్తున్నారు.

WhatsApp, Google అపరిమిత చాట్ బ్యాకప్ ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత ఈ మార్పులు మొదలయ్యాయి. ప్రస్తుతం Google Drive WhatsApp చాట్ బ్యాకప్ కోసం అపరిమిత నిల్వను అందిస్తుంది. అంటే అన్ని ఖాతాలకు అందుబాటులో ఉన్న 15GB వరకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ స్టోరేజ్ Apple, Microsoft అందించిన 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అయితే ఈ స్టోరేజ్ ఉచితం కాకపోతే వినియోగదారులు Google One సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ ధర రూ.130గా ఉంది.

Updated Date - Jan 03 , 2024 | 12:09 PM