ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Instagram : టెక్ట్స్‌తోనే.. క్షణాల్లో వీడియో ఎడిటింగ్..

ABN, Publish Date - Dec 20 , 2024 | 01:58 PM

రీల్స్ లేదా వీడియోలను అనుకున్న విధంగా రూపొందించేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు కంటెంట్ క్రియేటర్లు. నచ్చిన లొకేషన్, కాస్ట్యూమ్, బడ్జెట్ ఇలా అన్నీ సెట్ చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది.. ఇన్‌స్టా.. సింపుల్ టెక్ట్స్‌తో.. క్షణాల్లో వింత రీల్స్ ఎలా చేయవచ్చు అంటే..

Instagram

రీల్స్ లేదా వీడియోలను అనుకున్న విధంగా రూపొందించేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు కంటెంట్ క్రియేటర్లు. నచ్చిన లొకేషన్, కాస్ట్యూమ్, బడ్జెట్ ఇలా అన్నీ సెట్ చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది.. ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టా. ఈ ఫీచర్ సాయంతో రీల్స్‌ను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం పెద్దగా శ్రమ పడనక్కరలేదు. మెటా ఆధ్వర్యంలోని ఈ ప్రముఖ టెక్ కంపెనీ తీసుకురాబోతున్న ఆ సరికొత్త ఫీచర్ ఏంటనుకుంటున్నారా..


కంటెంట్ సృష్టిని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఆసక్తికర ఫీచర్ ప్రవేశపెడుతున్నట్లు రీల్ ద్వారా ప్రకటించారు.. ఇన్‌స్టా సీఈవో ఆడమ్ మొస్సేరీ. ఈ నయా జనరేటివ్ ఏఐ వీడియో ఎడిటింగ్ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుందో చూపించారు. ఈ సరికొత్త టూల్‌తో కంటెంట్‌ను వేగంగా, నచ్చిన తరహాలో రూపొందించుకోవచ్చని వెల్లడించారు. వచ్చే ఏడాది విడుదల కానుందని చెప్పారు. కచ్చితమైన తేదీని తెలియజేయలేదు. ఈ విభిన్న టూల్ ఇన్‌స్టా యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.


ఇన్‌స్టా సీఈవో ఆడమ్ విడుదల చేసిన టీజర్‌లో.. సెకనులో పదోవంతు సమయంలోనే ఆయన కాస్ట్యూమ్, బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు కార్టూన్‌లాగానూ మారిపోవటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆయన చేతులు, ముఖం కదిలిస్తూ మాట్లాడుతుండగానే నిజమేనేమో అనిపించేలా టీషర్ట్స్, ఉన్న ప్రదేశం మారిపోయాయి. మెడలో గొలుసు ప్రత్యక్షమైంది. తర్వాత వింత కార్టూన్‌ రూపం కళ్లెదుట ప్రత్యక్షమైంది. ఇలా ఒకదాని వెంట మరొక రూపం, ప్రదేశం క్షణకాలంలోనే కనిపిస్తూ మాయ చేసేసిందీ వింత ఫీచర్. ఆలోచనలకు హద్దులు చెరిపేసేలా కంటెంట్ క్రియేటర్లకు ఈ ఏఐ వీడియో ఎడిటింగ్ టూల్ ఉపయోగపడనుంది.


మెటా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసిన మూవీ జెనరేటివ్ ఏఐ మోడల్‌తో ఈ ఫీచర్ రూపొందించారు. ఈ ఏఐ టూల్ ఉపయోగించడం చాలా సులభం. అందుకు మీరు చేయాల్సిందల్లా మనకేం కావాలో వాటిని జస్ట్ పదాల రూపంలో టైప్ చేయడమే. దీంతో మీరు కోరుకున్న రూపం, ప్రాంతం, ప్రదేశం, కాస్ట్యూమ్‌.. ఇలా ఏదైనా సరే.. వెంటనే ఆ రూపంలోకి మీరు మారిపోతారు. కేవలం టెక్ట్స్ ద్వారా ఆలోచనలకు అనుగుణంగా మీ బ్యాక్‍‌గ్రౌండ్, కాస్ట్యూమ్ ఛేంజ్ అయిపోతాయి. ప్రపంచంలో ఉండే ప్రాంతాలకు ఒక్కటే అని కాదు. వాస్తవ ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి అనుకున్నదే తడవుగా వెళ్లిపోవచ్చు. మరి, వింత రీల్స్ చేసే అవకాశం కల్పిస్తున్న ఈ టూల్‌ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇన్‌స్టా యూజర్లు.

Updated Date - Dec 20 , 2024 | 03:58 PM