Loksabha Results: తెలంగాణ బీజేపీలో ఉత్సాహం నింపిన ఎగ్జిట్ పోల్స్
ABN, Publish Date - Jun 03 , 2024 | 09:04 AM
మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవనుంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను తెరచి ఓట్లను లెక్కిస్తారు.
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవనుంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను (EVM) తెరచి ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా లోక్ సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.
బీజేపీ ధీమా
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామనే ధీమాతో బీజేపీ ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లను గెలిచింది. ఈ సారి మరో ఆరు సీట్లు గెలుస్తామని విశ్వాసంతో ఉంది. మొత్తం 10 సీట్లను గెలిచి తెలంగాణ రాష్ట్రంలో బలపడతామని చెబుతోంది. ఇటీవల వచ్చిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ధీమాకు కారణం అవుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 20 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. ఆ సమయంలో 4 సీట్లను గెలుచుకుంది. ఈ సారి ఓటు శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో తమ సీట్లు పెరుగుతాయని బీజేపీ అంచనా వేసింది. రేపు కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కౌంటింగ్ ఏజెంట్లకు బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఎమరపాటు వద్దని, అలర్ట్‌గా ఉండాలని తేల్చి చెప్పింది.
Updated Date - Jun 03 , 2024 | 09:04 AM