Hyderabad: 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు!
ABN, Publish Date - Jun 20 , 2024 | 03:53 AM
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా మల్టీజోన్-1లోని 19 జిల్లాల పరిధిలోని 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అఽధికారులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
మల్టీజోన్-1లో 19 జిల్లాల వారికి అవకాశం
ఎస్‌జీటీలు, పండిట్లు, పీఈటీలకు ప్రమోషన్
నేటి నుంచి జోన్-2లో ఎస్‌ఏల బదిలీలు
హైదరాబాద్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా మల్టీజోన్-1లోని 19 జిల్లాల పరిధిలోని 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అఽధికారులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆయా జిల్లాల వారీగా పదోన్నతుల జాబితాలను విడుదల చేశారు. ఆ జాబితాలను అనుసరించి ఆయా జిల్లా డీఈవోలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ అఽధికారులు ఆదేశాలిచ్చారు. పదోన్నతులు పొందిన వారిలో ఎస్‌జీటీలతో పాటు పండిట్లు, పీఈటీలు కూడా ఉన్నారు. వారికి వెంటనే పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పూర్తి చేశారు.
తాజాగా ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పిస్తున్నారు. గురువారం నుంచి మల్టీజోన్-2 పరిధిలోని జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్ల(ఎ్‌సఏ)ను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతులు కల్పిస్తారు. కాగా, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Updated Date - Jun 20 , 2024 | 03:53 AM