ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak Church: మెదక్‌ చర్చి స్థాపకుడు పాస్నెట్‌కు కృతజ్ఞత సభ

ABN, Publish Date - Dec 24 , 2024 | 05:06 AM

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్‌ చర్చ్‌ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా చర్చి స్థాపకుడు పాస్నెట్‌కు కృతజ్ఞత సభ నిర్వహించారు.

  • వందేళ్ల ఉత్సవాల్లో నిర్వహణ.. హాజరైన పాస్నెట్‌ మునిమనవళ్లు

మెదక్‌ కల్చరల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్‌ చర్చ్‌ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా చర్చి స్థాపకుడు పాస్నెట్‌కు కృతజ్ఞత సభ నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెదక్‌ చర్చిలో గతంలో పనిచేసిన బిష్‌పలు, పాస్నెట్‌ మునిమనవళ్లు పాల్గొన్నారు. ఉదయం శిలువ ఆరాధన నిర్వహించిన అనంతరం వారంతా చర్చి వేదిక వద్ద ఏర్పాటు చేసిన పాస్నెట్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించారు.


ఈ సందర్భంగా చర్చ్‌ ఇన్‌చార్జి బిషప్‌ రూబెన్‌ మార్క్‌ మాట్లాడుతూ చర్చి వందేళ్ల సంబురాల్లో పాస్నెట్‌ రక్తసంబంధీకులు పాల్గొనడం శుభ పరిణామమన్నారు. మెదక్‌ చర్చి వందేళ్ల ఉత్సవాలకు సోమవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హారీ్‌షరావు హాజరయ్యారు. అనంతరం చర్చి ప్రధాన ద్వారం ముందు కేక్‌ కట్‌ చేసి క్రైస్తవ సోదరులకు తినిపించారు. హరీష్‌ వెంట మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 05:06 AM