ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

ABN, Publish Date - Dec 12 , 2024 | 06:11 PM

నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయి మృతిచెందారు.

ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయి మృతిచెందారు. జగదల్ పూర్, నారాయణపూర్, దంతెవాడ, కొండగావ్, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా బలగాలు పెద్దఎత్తున కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో వారికి మావోలు ఎదురపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య గురువారం తెల్లవారుజామున భీకర యుద్ధం జరిగింది. ఎదురు కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహించగా.. మావోలు తారసపడ్డారని, ఈ మేరకు జరిగిన ఎదురుకాల్పుల్లో వారు మృతిచెందినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఉండే అవకాశం ఉందని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.


కాగా, మావోయిస్టులపై గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు నవంబర్ 22న చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సైతం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.


తెలంగాణలోనూ..

ఈ ఏడాది డిసెంబర్ 1న తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరగగా.. ఏడుగురు మావోలు మృతిచెందారు. ఎదురు కాల్పుల్లో ఇల్లందు- నర్సంపేట ఏరియా కార్యదర్శి భద్రు సహా కీలక నేతలు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. టీఎస్‌సీఎం ఇల్లందు-నర్సంపేట సెక్రటరీ కుర్సం మంగు భద్రు అలియాస్ పాపన్న, ఏటూరునాగారం- మహదేవ్‌పూర్ డీవీసీఎం కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఏసీఎం ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఏసీఎం ముస్సాకి జమున, పార్టీ సభ్యులు జైసింగ్, కిషోర్, కామేశ్‌లు పోలీసులు వెల్లడించారు.


అందుకేనా?

ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు నవంబర్ 22న ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని, ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు. మృతులను ఉయిక రమేశ్‌, ఉయిక అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, రమేశ్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. వీరిని హతమార్చడంతోనే భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టి ఏడుగురు మావోయిస్టులను హతమార్చినట్లు సమాచారం. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.

Updated Date - Dec 12 , 2024 | 06:31 PM