ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Thermal Plant: నోటీసులకు 25 మంది అధికారుల వివరణ..

ABN, Publish Date - May 23 , 2024 | 04:30 AM

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో భాగస్వాములైన మొత్తం 28 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసులివ్వగా.. వారిలో 25 మంది దాకా అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానలిచ్చారు.

  • యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌పై నోటీసులు

  • మిగిలింది ముగ్గురే... 26 తర్వాత కమిషన్‌ విచారణ

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో భాగస్వాములైన మొత్తం 28 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసులివ్వగా.. వారిలో 25 మంది దాకా అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానలిచ్చారు. ఆయా నిర్ణయాల్లో వారి వారి పాత్ర ఏంటి..? అనే అంశంపై వివరణ, అభిప్రాయాలను కోరుతూ ఇంధనశాఖ మాజీ ముఖ్య కార్యదర్శులు సురేశ్‌ చందా, ఎస్‌కే జోషి, అర్వింద్‌కుమార్‌, అజయ్‌ మిశ్రా, ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎ్‌సఎన్పీడీసీఎల్‌ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్‌రావు, విద్యుత్తు సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

వారిలో అర్వింద్‌ కుమార్‌తో పాటు మరో ఇద్దరు మినహా మిగిలిన వారంతా లిఖితపూర్వకంగా కమిషన్‌కు వివరణ ఇచ్చారు. ఈనెల 26వ తేదీ తర్వాత ఫిర్యాదులతో పాటు నోటీసులకు జవాబులన్నీ పరిశీలించాకా.. కమిషన్‌ ప్రత్యక్ష విచారణ చేపట్టనుంది. జూలై లేదా ఆగస్టులో కమిషన్‌ నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయి.

Updated Date - May 23 , 2024 | 04:30 AM

Advertising
Advertising