ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NTR Stadium: పుస్తక ప్రియులకు పండుగ!

ABN, Publish Date - Dec 19 , 2024 | 03:52 AM

పుస్తక ప్రియులకు పండుగ. తీరొక్క పుస్తకాలు చూసి.. నచ్చిన పుస్తకాలను సొంతం చేసుకునేందుకు పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఎన్టీఆర్‌ స్టేడియంలోని తెలంగాణ కళాభారతిలో గురువారం నుంచి జనవరి 29వ తేదీ వరకు 37వ బుక్‌ఫెయిర్‌ నిర్వహించనున్నారు.

  • నేటి నుంచి 29 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో బుక్‌ ఫెయిర్‌

కవాడిగూడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పుస్తక ప్రియులకు పండుగ. తీరొక్క పుస్తకాలు చూసి.. నచ్చిన పుస్తకాలను సొంతం చేసుకునేందుకు పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఎన్టీఆర్‌ స్టేడియంలోని తెలంగాణ కళాభారతిలో గురువారం నుంచి జనవరి 29వ తేదీ వరకు 37వ బుక్‌ఫెయిర్‌ నిర్వహించనున్నారు. మొత్తంగా 350 స్టాళ్లు ఉంటాయని.. వీటిలో 171 తెలుగు, 135 ఇంగ్లిష్‌, 17 ప్రభుత్వ స్టాళ్లు, ఏడు రచయితల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. బుక్‌ఫెయిర్‌ ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య పేరు పెట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న రెండు వేదికల్లో ఒకదానికి బోయి విజయభారతి పేరు, మరోదానికి తోపుడు బండి సాధిక్‌ పేరు పెట్టనున్నారు.


సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారుల కోసం చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కోసం ప్రత్యేకంగా సలహాదారుల కమిటి ఏర్పాటు చేశారు. కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్‌ పత్రికా సంపాదకులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్‌ రమామేల్కోటే ఉన్నారు. బుక్‌ ఫెయిర్‌కు వచ్చే పుస్తక ప్రియుల కోసం మంచినీటి వసతి, మొబైల్‌ టాయిలెట్లు, శాశ్వత టాయిలెట్లు, ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం, ఫుడ్‌ స్టాళ ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అధ్యక్ష కార్యదర్శులు కవి యాకుబ్‌, వాసు వివరాలు వెల్లడించారు. బుక్‌ ఫెయిర్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 03:53 AM