ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aadi Srinivas: బీసీలతో కవితకు ఏం సంబంధం?

ABN, Publish Date - Dec 29 , 2024 | 03:55 AM

బీసీ రిజర్వేషన్లపై హడావుడి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అసలు బీసీలతో ఏం సంబంధమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

  • ఆమె నాయకత్వం బీసీలకు అవసరం లేదు: ఆది శ్రీనివాస్‌

  • మన్మోహన్‌ను భారతరత్నతో గౌరవించాలి: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై హడావుడి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అసలు బీసీలతో ఏం సంబంధమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా అంటూ శనివారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఆమె నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. జనవరి 3న సభ నిర్వహిస్తామని కవిత అంటున్నారని, బీసీల సభ నిర్వహించడానికి ఆమె ఎవరని ప్రశ్నించారు.


దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను భారతరత్నతో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని రైతుల రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేసింది, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాలను తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందీ మన్మోహనేనని.. హైదరాబాద్‌కు మెట్రో రైల్‌ రావడంలోనూ ఆయన పాత్ర ఉందని చెప్పారు.

Updated Date - Dec 29 , 2024 | 03:55 AM