ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB: తాండూరులో ఏసీబీ దాడులు

ABN, Publish Date - Dec 24 , 2024 | 04:47 AM

వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు కలకలం సృష్టించాయి.

  • రూ.5 లక్షలతో పట్టుబడ్డ సబ్‌కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది

తాండూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దాడులు నిర్వహించి రూ. 5 లక్షల లంచం తీసుకుంటున్న అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌(ఏవో) దానయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ మాణిక్‌రావులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల గ్రామంలోని సర్వే నంబరు 369లో 6 ఎకరాల 26 గుంటల పట్టా భూమికి సంబంధించి ఎల్‌ఎ్‌ఫ(ల్యాండ్‌ ఫామ్‌) రోడ్డు నుంచి పట్టా భూమికి మార్పిడి చేసేందుకు 5 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ సిటీ యూనిట్‌-1కి చెందిన ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించి లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకున్నారు. ఏవో దానయ్య నుంచి లంచం మొత్తం రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఏవో దానయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ మాణిక్‌ రావును అరెస్ట్‌ చేసి పీఆర్‌ఎల్‌ ఎదుట హాజరుపరిచారు.

Updated Date - Dec 24 , 2024 | 04:47 AM