Janagama: ఊత చీరే ఉరి తాడైంది..
ABN, Publish Date - May 26 , 2024 | 04:15 AM
బాత్‌రూమ్‌లో వృద్ధులు లేవడానికి సాయంగా కట్టిన చీరకు ప్రమాదవశాత్తు ఉరి పడడంతో ఓ బాలు డు మృతి చెందాడు. జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన బండిరాజుల ఆంజనేయులుకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు సంపత్ (11) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే మూడవ తరగతి పూర్తి చేశాడు.
ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుని బాలుడి మృతి
జనగామ, మే 25 (ఆంధ్రజ్యోతి): బాత్‌రూమ్‌లో వృద్ధులు లేవడానికి సాయంగా కట్టిన చీరకు ప్రమాదవశాత్తు ఉరి పడడంతో ఓ బాలు డు మృతి చెందాడు. జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన బండిరాజుల ఆంజనేయులుకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు సంపత్ (11) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే మూడవ తరగతి పూర్తి చేశాడు. సంపత్ తన తమ్ముడు గణేశ్‌తో కలిసి ఆడుకుంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు.
వృద్ధురాలైన ఆంజనేయులు నాన్నమ్మ కూర్చోవడానికి లేవడానికి సాయంగా బాత్‌రూమ్ పైకప్పు కర్రకు చీరను కట్టి ఉంచారు. ఈ క్రమంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సంపత్ ఆ చీరనుపట్టుకొని ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు ఉరి బిగుసుకుంది. దీంతో ఊపిరాడక సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Updated Date - May 26 , 2024 | 04:16 AM