వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:20 PM
పాత మంచిర్యాల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహా మండల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు నరహరి శర్మ ఆధ్వ ర్యంలో అయ్యప్ప అభిషేకంతోపాటు పడిపూజ నిర్వహించారు. అనం తరం అయ్యప్ప స్వాములు గ్రామంలో నగర సంకీర్తన చేశారు.

మంచిర్యాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పాత మంచిర్యాల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహా మండల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు నరహరి శర్మ ఆధ్వ ర్యంలో అయ్యప్ప అభిషేకంతోపాటు పడిపూజ నిర్వహించారు. అనం తరం అయ్యప్ప స్వాములు గ్రామంలో నగర సంకీర్తన చేశారు. మహా పడిపూజలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, సీనియర్ నాయకుడు గోనె శ్యాంసుంధర్‌రావు, పట్టణ కాంగ్రెస్ అధ్య క్షుడు తూముల నరేష్, కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్, గురు స్వాము లు ఒడ్నాల రవీంధర్, ఎర్రం ప్రభాకర్ అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.
చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి చెన్నూరు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సాముహిక అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కేరళకు చెందిన సంజీవన్ నంబ్రూత్రీ గురు స్వామి ఆధ్వర్యంలో ఉదయం అయ్యప్ప స్వామి ఆలయంలో అభిషేక, గణపతి పూజ, పుష్పార్చన, మంత్ర పూజ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, మహిళల కొలాటాలు, అయ్యప్ప స్వాముల శరణ ఘోషతో పాఠశాల మైదానం వరకు శోభాయాత్ర నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భజన, శరణ ఘోషతో పట్టణం మారుమోగింది. అయ్యప్ప పడి పూజ అనంతరం ఆయ్యప్ప స్వాములు అగ్ని గుండ ప్రవేశం చేశారు. గురుస్వాములు వేదాంతం సురేష్, పద్మనాభ చారి, మోహన్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, శ్రీనివాస్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.