ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

ABN, Publish Date - Oct 24 , 2024 | 08:47 AM

హైదరాబాద్: రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బయలుదేరనున్నారు.

హైదరాబాద్: రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ (BRS) ఉద్యమ బాట చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆదిలాబాద్, (Adilabad) కరీంనగర్ (Karimnagar), సిరిసిల్ల (Sirisilla)లో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బయలుదేరనున్నారు. ఉదయం 11:30 గంటలకు అదిలాబాద్ రాంలీల మైదానంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో రైతు పోరుబాట మహాధర్నా జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

ఆ్గదిలాబాద్ నుంచి రువారం సాయంత్రం కేటీఆర్ కరీంనగర్ వెళతారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.. అక్కడి నుంచి సిరిసిల్లకు వెళతారు. రాత్రి సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సిరిసిల్లలో విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకు పార్క్ హయత్ హోటల్‌లో ఒక కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారు.


కాగా రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపడుతుందని, గురువారం ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఈ సందర్బంగా సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, రైతు భరోసా ఎగ్గొట్టి ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటోందన్నారు. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మహిళలకు ఉచిత బస్సు మినహా మిగతా గ్యారంటీలు అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు లేనీ రాష్ట్రంగా పథకాలు అమలు చేస్తే, 300 రోజుల పాలనలో ఇప్పటికీ 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జోగు రామన్న ఆరోపించారు. ఎకరానికి తమ ప్రభుత్వం పదివేల రైతుబంధు ఇస్తే, అవహేళన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రూ.15,000 ఇస్తామని నమ్మించి మోసగించారన్నారు. కేబినెట్ సబ్ కమిటీ పేరిట కాలయాపన చేస్తూ రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం తీరును రాష్ట్రవ్యాప్తంగా ఎండగడతామన్నారు. పత్తికి గుజరాత్ మార్కెట్లో ఒక ధర కల్పించి రాష్ట్రంలో రు.7,520 ప్రకటించడం పట్ల ఎద్దేవా చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, పెళ్లిళ్లు చేసుకున్న పేదలకు తులం బంగారం, రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఉచిత కరెంటు పేరిట మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు.


కేటీఆర్ శంఖారావం..

రైతాంగ సమస్యలే ప్రధాన ఏజెండాగా కులమత రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమాలను చేపడుతున్నామని జోగు రామన్న తెలిపారు. గురువారం అదిలాబాద్ రాంలీల మైదానంలో కేటీఆర్ శంఖారావం పూరించనున్నారని, ఈ బహిరంగ సభకు రైతులందరూ హాజరుకావాలని పిలుపిచ్చారు. రైతు సమస్యలపై నిలదీస్తే ప్రశ్నించే గొంతుకులపై కేసులు నమోదు చేస్తున్నారని జోగు రామన్న విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు విజయనగరం జిల్లా పర్యటనకు జగన్

చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

నాతో పోటీ పడండి: చంద్రబాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 24 , 2024 | 08:47 AM