ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National Award: చిరంజీవికి అక్కినేని అవార్డ్‌..

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:41 AM

తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ప్రారంభించి తొలిసారిగా 2006లో బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌కు ఇచ్చారు.

  • వచ్చే నెల 28న అమితాబ్‌ చేతుల మీదుగా అందజేత

  • ఇకపై రెండేళ్లకోసారి అవార్డు ప్రదానం

  • నాగార్జున వెల్లడి

తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ప్రారంభించి తొలిసారిగా 2006లో బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌కు ఇచ్చారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ అవార్డులు ఇవ్వడం కోసం టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షుడిగా కోటి రూపాయల మూలధనంతో అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇక అప్పటినుంచి షబనా అజ్మీ, అంజలీదేవి, వైజయంతి మాల, లతా మంగేష్కర్‌, కె.బాలచందర్‌, హేమమాలిని, శ్యామ్‌ బెనగల్‌ వరుసగా అక్కినేని జాతీయ అవార్డ్‌ అందుకున్నారు.


ఆ తర్వాత అవార్డ్‌ ప్రదానానికి రెండేళ్ల గ్యాప్‌ వచ్చింది. 2014లో తిరిగి అమితాబ్‌ బచ్చన్‌కు అవార్డ్‌ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్‌ వచ్చింది. 2016లో తిరిగి జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరికి ఏయన్నార్‌ అవార్డ్‌ ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి, శ్రీదేవి, రేఖ ఈ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్‌ వచ్చింది. ఐదేళ్ల అనంతరం తిరిగి ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవికి ఏయన్నార్‌ జాతీయ అవార్డ్‌ ఇవ్వనున్నట్లు నాగార్జున శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెల 28న ఈ అవార్డ్‌ను ఆలిండియా మెగాస్టార్‌ అమితాబ్‌ చేతుల మీదుగా అందజేస్తామని ఆయన తెలిపారు. ఇకపై రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డ్‌ను ప్రదానం చేయనున్నట్లు నాగార్జున వెల్లడించారు. ఈ విషయం చెప్పగానే చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారనీ, ఇంతకంటే పెద్ద అవార్డ్‌ లేదన్నారని నాగార్జున చెప్పారు.

Updated Date - Sep 21 , 2024 | 04:41 AM