ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anand Mahindra: స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా... ఆనంద్‌ మహీంద్రా నియామకం

ABN, Publish Date - Aug 16 , 2024 | 03:30 AM

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను రాష్ట్రప్రభుత్వం నియమించింది.

  • కో-చైర్మన్‌గా శ్రీనిరాజు

  • ఏడాదిపాటు పదవుల్లో...

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను రాష్ట్రప్రభుత్వం నియమించింది. అలాగే ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీకి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా కో-చైర్మన్‌ హోదాలో నియమితులయ్యారు. ఈమేరకు తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు.


వీరు ఏడాది పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఆనంద్‌ మహీంద్రా ఆటోమొబైల్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఎనర్జీ, ఐటీ వంటి రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన మహీంద్రా గ్రూపు సంస్థలకు చైౖర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌(ఆసియా-పసిపిక్‌ అడ్వయిజరీ బోర్డు), హార్వర్డ్‌ గ్లోబల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ అడ్వయిజరీ కమిటీ, ఆసియా బిజినెస్‌ కౌన్సిల్‌ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థల సభ్యుడిగా ఉన్నారు. పద్మభూషణ్‌తో పాటు అనేక అవార్డులు పొందారు.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఆనంద్‌ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమై స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించిన విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీకి చైర్మన్‌గా కొనసాగాలని కోరిన విషయం కూడా తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఈ స్కిల్‌ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. అలాగే.. ఈ యూనివర్సిటీ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 16 , 2024 | 03:30 AM

Advertising
Advertising
<