Share News

అంగట్లో అంగన్‌వాడీ కోడి గుడ్లు

ABN , Publish Date - Jan 22 , 2024 | 02:52 AM

అంగన్‌వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పంపిణీ చేయాల్సిన కోడి గుడ్లు అవి. తెల్లగా మెరిసిపోతున్న ఆ గుడ్లపై నీలి రంగులో ఉన్న తెలంగాణ సర్కారు ముద్ర కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

అంగట్లో అంగన్‌వాడీ కోడి గుడ్లు

వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌లో చోద్యం

కులకచర్ల, జనవరి 21: అంగన్‌వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పంపిణీ చేయాల్సిన కోడి గుడ్లు అవి. తెల్లగా మెరిసిపోతున్న ఆ గుడ్లపై నీలి రంగులో ఉన్న తెలంగాణ సర్కారు ముద్ర కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అయితేనేం.. దర్జాగా వాటిని రోడ్డు మీద పెట్టి.. రండి బాబూ రండి అంటూ అగ్గువకు అమ్మేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మందిపాల్‌ గ్రామానికి చెందిన పెంటయ్య డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఇంటి ముందు ఓ స్టాండ్‌ ఏర్పాటు చేసిన అతడు.. దానిపై అంగన్‌వాడీ గుడ్లను పెట్టి అమ్మకాలు మొదలుపెట్టాడు. రూ.5కే గుడ్డు అంటూ బోర్డు పెట్టాడు. గమనించిన గ్రామస్థులు 600 కోడి గుడ్లను స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, తహసీల్దార్‌ ప్రభుకు సమాచారం ఇచ్చారు. ఆ గుడ్లను ఐసీడీఎస్‌ సిబ్బందికి అప్పజెప్పినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Jan 22 , 2024 | 02:53 AM