Yadadri: యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం..
ABN , Publish Date - Mar 02 , 2025 | 08:20 AM
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

యాదాద్రి: యాదగిరిగుట్ట (Yadagirigutta ) లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో (Lakshminarasimha Swamy Temple) బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) రెండో రోజు (2nd Day) ఆదివారం కొనసాగుతున్నాయి. ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం, హావనము తదితర పూజలు అర్చకులు నిర్వహించనున్నారు. ఆదివారం సెలవు దినం, మరోవైపు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్యూ లైన్లలో నిలుచుని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
కాగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రధానాలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వస్తివాచనం, అంకురారోపణం కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం నుంచి 6వ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం, దేవతాహ్వానం, వేదపారాయణ, హవన, అలంకార సేవలు జరుగుతాయి. 7వ తేదీన ఎదుర్కోలు, 8న లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం, 11న శతఘటాభిషేకం, శృంగారడోలోత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఉంటాయి.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రధానాలయాన్ని, ఆలయ మండపాలను, ముఖద్వారాలను, గోపురాన్ని విద్యుద్దీపాలు, వివిధ రకాల పూలమాలలు, అరటి, మామిడి తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ నెల 8న తిరుకల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారిని దర్శించుకొని.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొండపైకి వాహనాలను ఉచితంగా అనుమతించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆలయ ఈవో ఏపూరి భాస్కరరావు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులను భయభ్రాంతులకు గురిచేసిన అఘోరి...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News