ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kukatpally: అత్యుత్తమ సాంకేతికతతో అంకుర ఆస్పత్రి సేవలు

ABN, Publish Date - Jul 12 , 2024 | 03:42 AM

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్డ్‌ వైద్య సేవల కేంద్రంగా అంకుర ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు అంకుర హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ పున్నం తెలిపారు.

  • మహిళలు, శిశువులకు ప్రపంచ స్థాయి వైద్యం

  • అంకుర హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌

  • కూకట్‌పల్లిలో 120 పడకలతో నూతన ఆస్పత్రి ఏర్పాటు

  • భవనాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్డ్‌ వైద్య సేవల కేంద్రంగా అంకుర ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు అంకుర హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ పున్నం తెలిపారు. మహిళలు, శిశువులకు ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో కూకట్‌పల్లిలో 120 పడకలతో కొత్త ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కూకట్‌పల్లిలో అంకుర హాస్పిటల్స్‌ నూతన భవన సముదాయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించారు. అంకుర ఆస్పత్రిలో మహిళలు, శిశువులకు అందిస్తున్న అధునాతన సేవల గురించి అడిగి తెలుసుకుని, నిర్వాహకులను అభినందించారు.


అనంతరం అంకుర హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌ పున్నం మాట్లాడుతూ అంకుర, 9ఎం బై అంకురతో కలిపి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాలో 14 ప్రపంచ స్థాయి ఆస్పత్రులను నెలకొల్పినట్లు చెప్పారు. 2011లో కేపీహెచ్‌బీలో ప్రారంభమైన నాటి నుంచి అంకుర ఆస్పత్రిలో మహిళలు, పిల్లలకు లెవెల్‌ 3 ఎన్‌ఐసీయూ, పీఐసీయూ, ఆధునిక, సౌకర్యవంతమైన బర్తింగ్‌ సూట్‌లు, 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అంబులెన్స్‌ సేవలు, పీడియాట్రిక్‌, రుమటాలజీ, ఇమ్యునాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెమటాలజీ, ఆర్థోపెడిక్స్‌, ఎండో క్రినాలజీ వంటి అరుదైన స్పెషాలిటీస్‌ కవర్‌ చేసే వివిధ సూపర్‌ స్పెషలిస్టుల బృందం తమ వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు.


పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ యూరాలజీలో అత్యధిక విజయాలు సాధించడంలో అంకుర ప్రత్యేక గుర్తింపు పొందిందని వెల్లడించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కార్పొరేటర్‌ మాధవరం రోజాదేవి పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 03:42 AM

Advertising
Advertising
<