ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Annamalai: తెలంగాణ బతుకుల్లో మార్పు రాలేదు...

ABN, Publish Date - May 09 , 2024 | 11:09 AM

తెలంగాణ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై(Annamalai) అన్నారు.

- తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై

హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై(Annamalai) అన్నారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌ సెంటర్లో ఫోరం ఫర్‌ ఐటీ ఎంప్లాయీస్(ఫైట్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy)తో కలిసి ఆయన హాజరయ్యారు. ‘లెట్స్‌ యునైట్‌ వికసిత్‌ భారత్‌’ పేరుతో అన్నామలై సాఫ్ట్‌వేర్‌(Software) ఉద్యోగులతో ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ముందు చూపు, దార్శనికతతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Rain Alert: తెలంగాణలో 5 రోజులు వర్షాలు...ఎన్నికల రోజున కూడా..

దేశంలో అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కిందన్నారు. చేవెళ్ల(Chevella) పార్లమెంట్‌ ప్రజలు సేవ చేయాలనే తపన ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని అన్నామలై కోరారు. మోదీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ లాభాల బాటలో పయనిస్తున్నాయని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడోస్థానానికి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే రవికుమార్‌ యాదవ్‌, విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, సోదరి అనితారెడ్డి, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Rajasthan Chief Minister: తెలంగాణలోనూ ఉత్తరాది ఫలితాల..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 11:09 AM

Advertising
Advertising