TG Politics: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్
ABN, Publish Date - Mar 28 , 2024 | 10:21 PM
..పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్(BRS)కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలందరూ వరుసగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఇదేకోవలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య(Kadiyam Kavya) కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ విషయంపై కావ్య లేఖ రాశారు.
వరంగల్: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్(BRS)కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలందరూ వరుసగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఇదేకోవలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య(Kadiyam Kavya) కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ విషయంపై కావ్య లేఖ రాశారు.
Barrelakka Marriage: సందడే సందడి.. వెంకటేష్‌తో బర్రెలక్క ఏడడుగులు..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, పార్టీకి జనాదరణ కరువైన నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కావ్య ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ బరిలో వరంగల్ కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి లేదా కావ్యకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దమ్మున్న ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముందే చెప్పిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Big Breaking: గండిపేటలో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన 25 కార్లు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 28 , 2024 | 10:27 PM