Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. ఆ ఫ్లైట్ బీఆర్ఎస్ నేతదేనట..
ABN, Publish Date - Apr 04 , 2024 | 12:40 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యే అంశాలు ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ హైలైట్ అవుతోంది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో సంచలనం వెలుగు చూసింది. దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యే అంశాలు ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ హైలైట్ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రావు.. గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిసింది. ఈ సంభాషణల ఆధారంగానే గత ప్రభుత్వం అలర్ట్ అయినట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. అలాగే ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్‌లో బీఎల్ సంతోష్, తుషార్ కోసం ఢిల్లీ, కేరళకు ప్రత్యేక బృందం ఒకటి వెళ్లింది. దీనికోసం సిట్ టీం స్పెషల్ ఫ్లైట్‌ను వినియోగించింది.
Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!
ఆ ఫ్లైట్ బీఆర్ఎస్ నేతకు చెందినదిగా తాజాగా అధికారులు గుర్తించారు. స్పెషల్ ఫ్లైట్‌ను అక్రమంగా వాడుకున్నట్టు విచారణలో తేలింది. ప్రస్తుతం ఫ్లైట్ ఓనర్‌ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో ఎవరెవరు వెళ్లారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ హోదాలో రిటైర్ అయ్యాక.. ఆయన ఎస్‌ఐబీలో ఓఎస్డీ హోదాలో పనిచేయడం గమనార్హం..! బుధవారం ఉదయమే ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ఈ సందర్భంగా ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. ట్యాపింగ్ చేసిన తీరును వేణుగోపాల్ వివరించినట్లు సమాచారం. ఇటీవల అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును విచారించిన సందర్భంలో వేణుగోపాల్ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..! ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన ‘స్పెషల్ టాస్క్’ టీంలలో.. వేణుగోపాల్ సైబరాబాద్ బృందాలకు నేతృత్వం వహించినట్లు రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది.
BRS: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 04 , 2024 | 01:50 PM