TG Assembly: పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:00 AM
అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమితులయ్యారు.
అంచనాల కమిటీకి పద్మావతిరెడ్డి
ప్రభుత్వ రంగ సంస్థలకు శంకరయ్య
ఒక్కో కమిటీలో 13 మంది సభ్యులు
శాసనసభ నుంచి 9 మంది సభ్యులు
మండలి నుంచి నలుగురు చొప్పున.. అసెంబ్లీ కార్యాలయం బులెటిన్
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమితులయ్యారు. ఆయనతోపాటు అంచనాల కమిటీకి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డిని, ప్రభుత్వరంగ సంస్థల కమిటీకి షాద్‌నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్యను చైర్మన్‌లుగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ నియమించారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ మూడు కమిటీలకు ఎన్నికలు జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు వెల్లడించారు.
ప్రతి కమిటీకి శాసనసభ నుంచి 9 మంది, శాసనమండలి నుంచి నలుగురు ఎన్నికైనట్లు పేర్కొన్నారు. పీఏసీకి ఎన్నికైన సభ్యుల నుంచి అరికెపూడి గాంధీని, అంచనాల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి నలమాద పద్మావతిరెడ్డిని, ప్రభుత్వరంగ సంస్థల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి కె.శంకరయ్యను ఆయా కమిటీలకు చైర్మన్లుగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ నియమించినట్లు తెలుపుతూ సోమవారం బులెటిన్ విడుదల చేశారు. ఈ మూడు కమిటీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఏర్పాటు చేసినా.. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం మరుసటి ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నికలు నిర్వహించకపోతే ఇవే కమిటీలు కొనసాగుతాయి.
మూడు కమిటీలకు ఎన్నికైన సభ్యులు వీరే..!
ప్రజా పద్దుల కమిటీ: అరికెపూడిగాంధీ (చైర్మన్), వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకా్‌షరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు. మండలి నుంచి టి.జీవన్‌రెడ్డి, టి.భానుప్రసాద్ రావు, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్
అంచనాల కమిటీ: నలమాద పద్మావతి రెడ్డి (చైర్‌పర్సన్), వి.సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, సీహెచ్.విజయరమణారావు, కోరం కనకయ్య, రాందాస్ మాలోతు, యశస్విని మామిడాల, పైడి రాకేశ్‌రెడ్డి, మండలి నుంచి ఎం.ఎ్‌స.ప్రభాకర్‌రావు, సుంకరి రాజు, టి.రవీందర్‌రావు, వి.యాదవరెడ్డి
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ: కె. శంకరయ్య (చైర్మన్), పి.సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, పి.సంజీవరెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, కౌసర్ మొహియుద్దీన్, మండలి నుంచి పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, శేరి సుభా్‌షరెడ్డి, తాతా మధుసూదన్, మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ
Updated Date - Sep 10 , 2024 | 03:00 AM