Asha Workers: ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి
ABN, Publish Date - Dec 31 , 2024 | 04:47 AM
ఆశాలకు ప్రతి నెలా రూ. 18 వేల స్థిర వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నివ్వాలని ప్రభుత్వానికి ఆశా వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.
మంత్రి దామోదరకు ఆశా వర్కర్స్ యూనియన్ వినతి
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆశాలకు ప్రతి నెలా రూ. 18 వేల స్థిర వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నివ్వాలని ప్రభుత్వానికి ఆశా వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఆశా వర్కర్ల యూనియన్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని, అర్హులైన ఆశాలను ఎఎన్‌ఎమ్‌లుగా గుర్తించాలని కోరారు.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన ఆశాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, పీఎఫ్, ఈఎ్‌సఐ ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో ఆశా వర్కర్స్ యూనియన్ యం.డి.మైముద, ఉపాధ్యక్షులు శ్రీదేవి తదితరులున్నారు.
Updated Date - Dec 31 , 2024 | 04:47 AM