ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రచారం..పైపైనే!

ABN, Publish Date - May 12 , 2024 | 06:01 AM

పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు (అసెంబ్లీ

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల నామమాత్రపు స్పందన

?వెళ్లామా.. కనిపించామా.. వచ్చామా.. అన్నట్లుగానే!..

నేతల్లో కనిపించని అసెంబ్లీ ఎన్నికల నాటి పట్టుదల

ఎంపీ అభ్యర్థులు, అగ్రనేతలు వచ్చినపుడే హడావిడి..

ఉదయం, సాయంత్రాల్లో... అడపా దడపా ప్రచారం

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల దాదాపు ఇంతే..

ఎంపీ అభ్యర్థులకు దాదాపుగా సహాయ నిరాకరణ

(ఆదిలాబాద్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)

పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు (అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు) అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. నాలుగు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వ్యవహరించిన తీరుకు, ప్రస్తుతం ఎంపీ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొంటున్న తీరుకు పూర్తిగా వైరుధ్యం కనిపిస్తోంది. వెళ్లామా? కనిపించామా? వచ్చామా? అన్నట్లుగానే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల వ్యవహార శైలి ఉంటోందని తెలుస్తోంది. ప్రత్యేకించి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల్లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ అభ్యర్థికి అత్యధికమెజారిటీ తెప్పించాలనే పట్టుదల చాలా మందిలో లోపించిందనే విమర్శలున్నాయి. కొందరైతే.. ఇది మన ఎన్నిక కాదు కదా? అనే భావనలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా పలు చోట్ల ఎంపీ అభ్యర్థులకు.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో సమన్వయం కొరవడిందని అంటున్నారు. పార్టీ ఆదేశాల మేరకు వారు ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ.. చాలామంది నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రస్తుత ఎంపీ అభ్యర్థి ఎక్కడున్నారు? పార్టీలో ఉన్నారా? లేదా? తన తరఫున ప్రచారంలో పాల్గొన్నారా? లేదా? ఎన్నికల ఖర్చుల కోసం ఏమైనా ఆర్థికసాయం చేశారా? తన రాజకీయ ప్రత్యర్థులతో ఏమైనా చేతులు కలిపారా? అనే అంశాలను బేరీజు వేసుకొని మరీ స్పందిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ప్రతీకారానికి తగిన సమయం!

ఎంపీ అభ్యర్థులతో ముందునుంచీ పొసగని కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే అదనుగా భావిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలు గట్టిగా ఉన్నప్పటికీ.. ఎంతవరకు పనిచేయాలో అంతవరకే చేస్తున్నారు. ఉదాహరణకు.. ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు శక్తియుక్తులన్నీ పోగు చేసి విజయం సాధించారు. కానీ, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి సీన్‌ మారిపోయింది. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వలసవచ్చిన గోడెం నగేశ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చారు. అయితే ఆయనకు బీజేపీ ఎమ్మెల్యేల్లోనే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఉన్నారు. ఈ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 4.49 లక్షల ఓట్లు వచ్చాయి. కానీ, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల వ్యవహారశైలి చూస్తుంటే.. పాత ఓటుబ్యాంకు నిలబడుతుందా? లేదా? అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీలోనే తమ ఎమ్మెల్యేలు, నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని ఓ సీనియర్‌ నేత స్వయంగా వ్యాఖ్యానించారు. అయినా గెలుస్తామనే ధీమా వ్యక్తంచేశారు. సిటింగ్‌ ఎంపీగా ఉన్న నేత.. సొంత పార్టీకి కాకుండా ఓ ప్రాంతీయ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు నియోజకవర్గంలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు.


అభ్యర్థికి, ఎమ్మెల్యేలకు లేని సఖ్యత..

నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఓ ప్రతిపక్ష పార్టీ పార్లమెంటు అభ్యర్థికి, ఎమ్మెల్యేలకు మధ్య ఏమాత్రం సఖ్యత లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బీజేపీకి ఇద్దరు, బీఆర్‌ఎ్‌సకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. వీరంతా మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. కాగా, జహీరాబాద్‌ పార్లమెంటు బీజేపీ అభ్యర్థికి, అసెంబ్లీ సెగ్మెంటు ఇన్‌చార్జులకు ఏమాత్రం పొసగడంలేదని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థి.. తన బంధువులు, మిత్రులు, నిర్మాణ కంపెనీలో పనిచేసే ఉద్యోగులతోనే ఖర్చులు, వ్యవహారాలు, ఎన్నికల ప్రక్రియను నడిపిస్తున్నారని, తమను నమ్మడంలేదని నియోజకవర్గ ఇన్‌చార్జులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా ఎంపీ అభ్యర్థి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణకు, అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డికి తాజాగా డీసీసీ కార్యాలయంలో ఒక ఆసక్తికర చర్చ జరిగింది. ఆదిలాబాద్‌ టౌన్‌లో ఎన్నికల ప్రచారానికి వస్తానని సుగుణ ఫోన్‌ చేయగా.. తాను ఆదిలాబాద్‌లో లేనని, హైదరాబాద్‌లో ఉన్నానని శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. అయితే అటుగా ప్రచారానికి వెళ్లిన సుగుణ.. డీసీసీ కార్యాలయానికి వెళ్లేసరికి శ్రీనివా్‌సరెడ్డి ఎదురయ్యారు. ‘‘ఏందన్నా? ఆదిలాబాద్‌లో ఉండి కూడా హైదరాబాద్‌ వెళ్లినట్లు చెప్పావ్‌?’’ అని ఎంపీ అభ్యర్థి ప్రశ్నించిన సంఘటన కార్యకర్తల సమక్షంలోనే జరగడం గమనార్హం.


కాంగ్రెస్‌లో కాస్త బెటర్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలే కావడం, మూడు నెలలు కాగానే ఎన్నికల కోడ్‌ రావడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కోడ్‌ ముగియగానే పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రివర్గ విస్తరణ కూడా జరగాల్సి ఉంది. కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపిస్తే... మంత్రివర్గంలో బెర్తు దొరుకుతుందనే ఆశతో పనిచేస్తున్నారు. మరికొందరు నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్నారు. నియోజకవర్గం, మండలం, గ్రామంలోని కార్యకర్తలను సమన్వయం చేసుకొని కొందరు నేతలు ఎంపీ ఎన్నికల ప్రచారంలో గట్టిగా పాల్గొంటున్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా.. కాంగ్రెస్‌ క్యాడర్‌ పనితీరులో కాస్త మెరుగైన వాతావరణం కనిపిస్తోంది.

అన్ని చోట్లా అదే అయోమయం..!

మెదక్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, నల్లగొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, పెద్దపల్లి, ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని ఎంపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ అగ్రనేతలు, స్టార్‌ క్యాంపెయినర్లు వచ్చినపుడు మాత్రమే నామమాత్రంగా పాల్గొంటున్నారని, ఫోన్‌చేసి పిలిస్తే.. ఉదయం, సాయంత్రం పూట కాసేపు ప్రచారం పాల్గొని ఇంటికెళ్లిపోతున్నారని అంటున్నారు. అయితే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు అధికారం కోల్పోయామన్న నైరాశ్యంతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారమే లేదు.. ఎంపీ గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే అనే నిరాశా నిస్పృహలతో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 12 , 2024 | 06:01 AM

Advertising
Advertising