AV Ranganath: రంగనాథ్ హెచ్చరిక.. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
ABN, Publish Date - Dec 13 , 2024 | 06:52 AM
మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్, కూల్చివేతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ: మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్, కూల్చివేతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) స్పష్టం చేశారు. పలు సంస్థలు పనిగట్టుకొని హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. హైడ్రాకు సంబంధం లేని విషయాలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Kavitha: ‘బయ్యారం’ కోసం బీజెపీ ఎంపీలు పోరాడాలి
రామంతాపూర్(Ramanthapur)లో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మరణించగా.. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇంటిని మార్క్ చేశారన్న ఆందోళనతో చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రంగనాథ్(Ranganath) మూసీ మార్కింగ్, కూల్చివేతలపై మరోసారి స్పష్టతనిస్తూ హైడ్రాకు సంబంధం లేదని పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 13 , 2024 | 07:50 AM