ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amazon Web Services: హైదరాబాద్‌లో అమెజాన్‌ 4వ డేటా సెంటర్‌!

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:55 AM

ఇప్పటికే మూడు డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సంస్థ (ఏడబ్ల్యూఎస్‌).. పెట్టుబడులను మరింత విస్తరించడంతోపాటు, నాలుగో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.

  • పెట్టుబడులను మరింత విస్తరిస్తాం

  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో

  • చర్చల అనంతరం సంస్థ వెల్లడి

  • తెలంగాణ సర్కారు ‘డిజిటల్‌’

  • లక్ష్యాల సాధనకు సహకరిస్తాం

  • మా సంస్థ వృద్ధి వ్యూహంలో

  • హైదరాబాద్‌ విడదీయలేని భాగం

  • అమెజాన్‌ ఉపాధ్యక్షుడు కెర్రీ పర్సన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే మూడు డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సంస్థ (ఏడబ్ల్యూఎస్‌).. పెట్టుబడులను మరింత విస్తరించడంతోపాటు, నాలుగో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత సేవల నిమిత్తం.. కొత్త హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడం, రాష్ట్రంలో తమ పెట్టుబడుల విస్తరణ వంటి ప్రణాళికల గురించి ఆ సంస్థ ఉపాధ్యక్షుడు (ప్లానింగ్‌ అండ్‌ డెలివరీ) కెర్రీ పర్సన్‌ వెల్లడించారు.


అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఆదివారం కెర్రీ పర్సన్‌తో సమావేశమయ్యారు. అమెజాన్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, విజయవంతమయ్యాయని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారంతో పాటు అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చామని.. మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ క్లౌడ్‌ సేవల వృద్థికి హైదరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తుందని.. కెర్రీ పర్సన్‌ ఆశాభావం వెలిబుచ్చారు.


తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ వృద్థిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ సహకారం తప్పకుండా ఉంటుందని.. అలాగే, ఏడబ్ల్యూఎస్‌ అభివృద్ధి వ్యూహంలో హైదరాబాద్‌ విడదీయలేని భాగమని ఆయన పేర్కొన్నారు. కొత్త డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై కంపెనీ త్వరలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. కాగా.. కెర్రీపర్సన్‌తో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్‌ రంజన్‌, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌ రెడ్డి, సీఈవో మధుసూదన్‌, తదితరులు పాల్గొన్నారు.


  • ఇప్పటికే..

అమెజాన్‌ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్‌ భవనం హైదరాబాద్‌లో ఉంది. గత ఏడాది.. అమెజాన్‌ సంస్థ డెడికేటెడ్‌ ఎయిర్‌కార్గో నెట్‌వర్క్‌ అయిన ‘అమెజాన్‌ ఎయిర్‌’ను భాగ్యనగరంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక.. ఆ సంస్థకు చెందిన మూడు పెద్ద డేటా సెంటర్లు ఇప్పటికే ఇక్కడి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

Updated Date - Aug 12 , 2024 | 02:55 AM

Advertising
Advertising
<