ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ED inquiry: ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్‌

ABN, Publish Date - Oct 09 , 2024 | 03:29 AM

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

  • నాపై తప్పుడు అభియోగాలు విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తా: అజారుద్దీన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గతంలో ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మనీలాండరింగ్‌ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ గత నవంబరులో సోదాలు జరిపింది. విచారణలో లభించిన సమాచారం, సోదాల్లో లభించిన పత్రాల మేరకు అజారుద్దీన్‌ను విచారించేందుకు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. నోటీ్‌సలు అందుకున్న అజారుద్దీన్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.


పలు అంశాలపై అజారుద్దీన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే మరోసారి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ముగ్గురు అధికారుల బృందం దాదాపు తొమ్మిది గంటలపాటు విచారించినట్లు తెలిసింది. విచారణ అనంతరం అజారుద్దీన్‌ మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారన్నారని వెల్లడించారు. కేసు విచారణ పూర్తి అయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. క్రికెట్‌ బంతుల కొనుగోలు, జిమ్‌ పరికరాలు, అగ్నిమాపక పరికరాలు, బకెట్‌ చైర్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి అజారుద్దీన్‌ ముందస్తు బెయిల్‌ పొందారు. తాజాగా ఈడీ నోటీసులు అందడంతో విచారణకు హాజరయ్యారు.

Updated Date - Oct 09 , 2024 | 03:29 AM