ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: కాంగ్రెస్‌తో కేసీఆర్‌ ముచ్చట

ABN, Publish Date - Aug 20 , 2024 | 03:15 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌ పెద్దలతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

  • మంచి ముహూర్తాన బీఆర్‌ఎస్‌ విలీనం

  • అందుకే అవినీతి కేసులన్నీ అటకెక్కించారు

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి

  • రాష్ట్ర విద్యా కమిషన్‌లో నక్సల్‌ భావజాలం

  • ఉన్న వ్యక్తులు ఉన్నారంటూ వ్యాఖ్య

భగత్‌నగర్‌ (కరీంనగర్‌)/మంచిర్యాల, ఆగస్టు 19: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌ పెద్దలతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ విలీనమవడమే తరువాయి అన్నారు. మాటా ముచ్చటతో సహా కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలకు కప్పం కూడా చెల్లించినట్లున్నారని చెప్పారు. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌, డ్రగ్స్‌ సహా కేసీఆర్‌ కుటుంబంపై ఉన్న అవినీతి కేసులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందని తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.


కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో వేస్తామన్న వారు ఇప్పుడు ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. విలీనంపై కాంగ్రె్‌సతో కేసీఆర్‌ చర్చలు పూర్తయినట్లు సమాచారం ఉందని సంజయ్‌ అన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతనే లేదని చెప్పారు. రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి రూ.17 వేల కోట్లు మాత్రమే చేసి సోనియానే మోసం చేశారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. ఇవన్నీ అడుగుతుంటే బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనమంటూ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎ్‌సను విలీనం చేసుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు. విలీన అవసరం కాంగ్రె్‌సకే ఉందని చెప్పారు.


  • పీఎంఏవై ఇళ్లపై ఇందిరమ్మ ఫొటో పెడితే నిధులివ్వం

రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద కేంద్రం ఇచ్చే నిధులతో నిర్మించే ఇళ్లపై ఇందిర, సోనియా బొమ్మలు పెడితే నిధులు ఇచ్చేది లేదని, కచ్చితంగా ప్రధాని మోదీ ఫొటో ఉండాల్సిందేనని సంజయ్‌ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. ఆ నిధులను అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఎన్ని ఇళ్లయినా మంజూరు చేస్తామని, వాటిని రాజకీయాల కోసం వాడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.


  • నక్సల్‌ భావజాలం వల్లే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది

విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించే నిలయాలుగా శిశుమందిరాలు విరాజిల్లుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని రాంపూర్‌ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పాఠశాల నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యాకమిషన్‌లో నక్సల్‌ భావజాలం ఉన్న వ్యక్తులు ఉండడం వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉందని సంజయ్‌ అన్నారు. ఈ విషయంలో మేధావి వర్గం జాగృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే పిల్లలు తుపాకులు పట్టుకుని తిరుగుతారు తప్ప, చేతిలో జాతీయ జెండాలు పట్టుకోరని తెలిపారు.

Updated Date - Aug 20 , 2024 | 03:15 AM

Advertising
Advertising
<