ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులివ్వరేం?

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:09 AM

‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?

  • ఒవైసీకి ఓ న్యాయం? ఇతరులకు మరో న్యాయమా?.. హైడ్రా ఓ నాటకం: బండి సంజయ్‌

  • హైడ్రా అంటేనే పేదలు వణికిపోతున్నారు: ఈటల

  • అన్ని వర్గాల ప్రజలను పార్టీ సభ్యులుగా చేర్చాలి: లక్ష్మణ్‌

హైదరాబాద్‌ సిటీ/వనస్థలిపురం, ఆగస్టు 30(ఆంధ్ర జ్యోతి): ‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు? మా సంస్థలపై చెయ్యేస్తే అంతు చూస్తామని ఒవైసీ బెదిరిస్తే చేతులు ముడుచుకుని కూర్చోవడానికి ప్రభుత్వానికి సిగ్గు లేదా?’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. నాగోలులోని శుభం కన్వెన్షన్‌ హాలులో శుక్రవారం వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు కోసం వర్క్‌ షాపు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒవైసీ అరాచకాలను అణిచివేసి, హిందువులకు భరోసా కల్పించేందుకే గతంలో పాతబస్తీ నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించామని గుర్తు చేశారు. రుణమాఫీ సర్వే పేరుతో కాంగ్రెస్‌ సర్కారు మళ్లీ డ్రామాలు ప్రారంభించిందని దుయ్యబట్టారు. రుణమాఫీ ఎంతమందికి వర్తించింది? ఇంకా అర్హులెందరు? అనే వివరాలు బ్యాంకుల వద్ద ఉండగా.. మళ్లీ సర్వే ఎందుకు? అని ప్రశ్నించారు. హైడ్రా దాడులు, విగ్రహాల లొల్లి.. అంతా ఓ నాటకమని విమర్శించారు. కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? ఒక పార్టీ లేదా ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్‌ ఇస్తుందనడం సిగ్గు చేటని విమర్శించారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విలీనం మాట ముచ్చట పూర్తయ్యిందని, అమెరికాలో అప్పగింతలు జరగబోతున్నాయన్నారు. కుటుంబ, అవినీతి పాలనకు బీజేపీ వ్యతిరేకమని, కలలో కూడా ఆ పార్టీని కలుపుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని బీజేపీ సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేపట్టనున్నామని తెలిపారు. 8800002024 నంబర్‌ కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా ప్రజలు బీజేపీ సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు.


అన్ని వర్గాల ప్రజలను పార్టీ సభ్యులుగా చేర్పించేందుకృషి చేయాలని ఎంపీ లక్ష్మణ్‌ కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖమ్మం, నల్లగొండతోపాటు బలహీనంగా ఉన్న జిల్లాల్లో అత్యధిక సభ్యత్వం చేపట్టాలని సూచించారు. హైడ్రా పేరు వింటేనే పేదలు వణికిపోతున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. చెరువుల వద్ద ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు ఎలా కూలుస్తుందని ప్రశ్నించారు. చెరువులను కాపాడేందుకు... అక్రమ కట్టడాలు కూల్చాల్సిందేనని, కానీ.. పేదల జోలికిరావొద్దని హెచ్చరించారు.


  • హైడ్రా వెనుక.. హైడ్రామా: డీకే అరుణ

హైడ్రా వెనుక హైడ్రామా నడుస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయగా, హైదరాబాద్‌లో వందలాది మందికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. హామీల అమలు విషయంలో ప్రజలు, విపక్షాల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్‌ సర్కారు హైడ్రాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.

Updated Date - Aug 31 , 2024 | 03:10 AM

Advertising
Advertising