ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: లారీ కింద ఇరుక్కున్న మహిళ.. బండి సంజయ్‌ చొరవతో బయటికి

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:10 AM

ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుని అవస్థ పడుతోన్న ఓ మహిళ... కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవ తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది.

  • సాయం చేసి ఆస్పత్రికి పంపించిన కేంద్రమంత్రి

హుజూరాబాద్‌రూరల్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుని అవస్థ పడుతోన్న ఓ మహిళ... కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవ తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌ వద్ద సోమవారం జరిగింది. మానకొండూరు మండలం కెల్లెడకు చెందిన దివ్యశ్రీ, ఆమె భర్త, పిల్లలు బైక్‌పై హుజూరాబాద్‌ నుంచి మానకొండూరుకు వెళ్తున్నారు. సింగాపూర్‌ శివారులో వాహనం అదుపు తప్పడంతో భర్త, పిల్లలు ఒకవైపు పడిపోగా దివ్యశ్రీ రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వచ్చిన లారీ వెనక టైర్ల కింద దివ్యశ్రీ జడ చిక్కుకుపోయింది. దీంతో ఆమెను లారీ కొంత దూరం ఈడ్చుకు పోయింది.


చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో డ్రైవర్‌ లారీ ఆపేశాడు. ఈ క్రమంలో ములుగు పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్‌ తన కాన్వాయ్‌ను ఆపి మహిళను రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. వెంట్రుకలు కత్తిరించి ఆమెను బయటకు తీశారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్సకు అయ్యే ఖర్చులు తానే చెల్లిస్తానని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Updated Date - Nov 12 , 2024 | 04:10 AM