ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BC Students: బీసీ విదేశీ విద్యా నిధిలో జాప్యం

ABN, Publish Date - Dec 26 , 2024 | 03:35 AM

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే బీసీ విద్యార్థులకు విదేశీ విద్యా నిధి కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం ఆశించిన స్థాయిలో అందడంలేదు. అంతేకాకుండా ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల సంఖ్య పెంపు అంశంలోనూ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదు.

  • ఈ ఏడాది రెండు సీజన్లలో 2,141 అర్జీలు

  • నెలలు గడుస్తున్నా జరగని స్ర్కూటినీ

  • దరఖాస్తుదారుల ఎదురుచూపు

  • గత ఏడాది విద్యార్థులకు అరకొర నిధులు కొలిక్కిరాని లబ్ధిదారుల పెంపు అంశం

హైదరాబాద్‌/ఖమ్మం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే బీసీ విద్యార్థులకు విదేశీ విద్యా నిధి కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం ఆశించిన స్థాయిలో అందడంలేదు. అంతేకాకుండా ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల సంఖ్య పెంపు అంశంలోనూ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదు. వెరసి ఒకవైపు దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందకపోవడంతో పాటు, మరోవైపు లబ్ధిదారుల సంఖ్యను కూడా పెంచకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. తెలంగాణలోని బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా గత ప్రభుత్వం ‘మహాత్మా జ్యోతి బాఫూలే విదేశీ విద్యా నిధి’ పథకాన్ని 2017-18లో ప్రారంభించింది. ఈ పథకం కింద బీసీ సంక్షేమ శాఖ ఫిబ్రవరి-మార్చి, సెప్టెంబరులో.. ఒక్కో సీజన్‌కు 150 చొప్పున 300 దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇవీకాక ముఖ్యమంత్రి విచక్షణ కింద కొన్నింటికి అవకాశం కల్పించేవారు.


2024 ఫిబ్రవరిలో 1,119, సెప్టెంబరులో 1,022 చొప్పున రెండు సీజన్లకు కలిపి 2,141 దరఖాస్తులు వచ్చాయి. కానీ, ప్రభుత్వం సాయం అందించే 300 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాయం అందించకపోవడం గమనార్హం. వచ్చిన దరఖాస్తులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఎవరు అర్హులో తేల్చే స్ర్కూటినీ చేయలేదు. దీంతో తమకు సాయం అందుతుందో లేదోనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. అసలు పథకం అమలుకు ఎందుకు జాప్యం జరుగుతుందన్న విషయంలో స్పష్టత లేదు. మరోవైపు 2023-24 ఏడాదిలో అర్హులైన లబ్ధిదారులకు కూడా పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం అందలేదు. ఒకరికి మొదటి విడత సాయం అందితే.. ఇంకొకరికి రెండో విడత సాయం అందలేదు. మరికొంతమందికి అసలు సాయమే అందలేదు. గతంలో పథకం కింద ఎంపికైన వారికి సాయం అందించేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో రూ.80కోట్లను కేటాయించింది. వీటిలో రూ.15కోట్లను మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.10 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరిగాయి. అంటే కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో అందించలేదు. కాగా, బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థులకు గరిష్ఠంగా రూ.20లక్షల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది.


కొలిక్కిరాని లబ్ధిదారుల పెంపు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలో అమలవుతున్న విదేశీ విద్యా నిధి పథకంలో ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి లబ్ధిదారుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. వాటి ప్రకారం.. బీసీ విదేశీ విద్యానిధిలో ప్రస్తుతం ఉన్న 300 దరఖాస్తులను 800 చేయాలని (ఫిబ్రవరి, సెప్టెంబరులో 250 చొప్పున 500, సీఎం కోటా కింద 300), ఎస్సీ శాఖలో ప్రస్తుతం ఉన్న 210 దరఖాస్తుల సంఖ్యను 500 వరకు చేయాలని, ఎస్టీలో ఉన్న 100ను 450-500 వరకు చేయాలని, మైనారిటీలో ఉన్న 500 సంఖ్యను కొంత మేర పెంచాలని ఆయా శాఖల అధి కారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, నెలలు గడుస్తున్నా ఇంత వరకు వీటిపై ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో అసలు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Dec 26 , 2024 | 03:35 AM