ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భద్రాచలంలో గ్రామ పంచాయతీలపై విలీనంపై సీఎం చొరవ తీసుకోవాలి: తుమ్మల

ABN, Publish Date - Jul 03 , 2024 | 03:07 AM

ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుష్తోమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు.

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుష్తోమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలు ఏపీలో విలీనమయ్యాయని గుర్తు చేశారు. భద్రాచలం పట్టణం మినహా మిగిలిన గ్రామాలను విలీనం చేశారని పేర్కొన్నారు.

భద్రాచలం పట్టణ శివారు నుంచి ఏపీ కావటంతో డంపింగ్‌ యార్డుకు స్థలం లేదని తుమ్మల తెలిపారు. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తమపట్నంలో ఉండటంతో భూములపై ఆలయ అధికారుల పర్యవేక్షణకు పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఆ ఐదింటిని భద్రాచలంలో కలపాలని తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 03 , 2024 | 09:39 AM

Advertising
Advertising