TG Politics: కేసీఆర్ ఆ విషయంలో చిల్లర ప్రచారం చేస్తున్నారు: భట్టివిక్రమార్క
ABN, Publish Date - Apr 01 , 2024 | 06:35 PM
తెలంగాణ ప్రజలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మోయలేని భారం మోపారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలేనని అన్నారు.
ఢిల్లీ: తెలంగాణ ప్రజలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మోయలేని భారం మోపారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలేనని అన్నారు. జనరేటర్ పవర్‌తో నిన్నటి సభలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మధ్యలో కరెంట్ పోయిందని చిల్లర ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులను ఎన్జీటీ రద్దు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు.ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజలను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు వేల మెగావాట్ల పవర్ తెలంగాణకు ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందని చెప్పారు.
Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్
2400 మెగావాట్ల పీపీఏ అగ్రిమెంట్లు చేసుకోకుండా కేసీఆర్ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆయన పాపం వల్లే ఎన్టీపీసీ రాష్ట్రానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు లాభం కోసం కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీపీసీ వల్ల కరెంట్ యూనిట్‌కు 9 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆసంస్థకు లక్ష పదివేల కోట్ల రూపాయలను గత కేసీఆర్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటనకు వస్తున్నామని చెప్పారు. గతంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను పూర్తి చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ లాగా ప్రధానమంత్రి కావడానికి పది రోజులు ఇక్కడే ఉండి కుట్రలు చేయలేదన్నారు. తాము ఇతరులతో చర్చలు జరపలేదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం కాల్వల్లోకి కేసీఆర్ నీరు వదిలారన్నారు.
ఇప్పటికే తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని, కరెంట్‌ను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. 2019 లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే మొదటి నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందని... తాము వచ్చిన తర్వాత ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చామని చెప్పారు. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను పెడితే అవి కూడా ఇచ్చుకుంటూ వచ్చామన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలను ఇచ్చామని చెప్పారు. 5 ఏళ్లలో మహిళలకు వడ్డీలేని లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. పంట నష్టం జరిగిన వెంటనే రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ వచ్చాకే వర్షాలు రావడం లేదని కేసీఆర్ అంటున్నారని... జూన్‌లో ప్రభుత్వం బీఆర్ఎస్‌ది కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న దగ్గరి నుంచే వర్షాలు రావట్లేదన్నారు. రిజర్వాయర్‌లో ఎక్కడ నీళ్లు లేకున్నా అది కేసీఆర్ పుణ్యమేనని చెప్పారు. నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో నీళ్లు లేకుండా కేసీఆర్ చేశారని భట్టివిక్రమార్క మండిపడ్డారు.
Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 01 , 2024 | 06:53 PM