TG Politics: బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు.. కేసీఆర్‌పై మంత్రి భట్టి ఫైర్
ABN, Publish Date - Apr 04 , 2024 | 06:54 PM
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ (Congress) మాత్రమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. తుక్కుగూడలోని ‘ జన గర్జన’ సభ ఏర్పాట్లను గురువారం నాడు పరిశీలించారు.
తుక్కుగూడ: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ (Congress) మాత్రమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. తుక్కుగూడలోని ‘ జన గర్జన’ సభ ఏర్పాట్లను గురువారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కదం తొక్కుదాం.. కాంగ్రెస్ తడాఖా దేశానికి చాటుదామని పిలుపునిచ్చారు. తుక్కుగూడ ‘ జన గర్జన’ సభ ఈ దేశానికి దిశానిర్దేశం చేయనుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను తుక్కుగూడ సభ నుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుందని తెలిపారు.
BRS: బీఆర్ఎస్‌ను దెబ్బేసింది ఇదే.. 'సారు'కు తెలిసొచ్చింది!
అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా అని నిలదీశారు. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారాలు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ నేతలు తెలుసుకున్నారని విరుచుకుపడ్డారు. జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కేసీఆర్ ఒడిసి పట్టలేదన్నారు. అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందికి ఎందుకు వదిలారని ప్రశ్నించారు.
AP Elections: మాగంటి గోపినాథ్ సర్వేపై ఫైర్
ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు
64.75 లక్షల మంది రైతులకు రైతుబంధును రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు. రైతు బీమా కింద రూ. 1500 కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందని అన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందజేస్తున్నామని చెప్పారు. 30 వేల ఉద్యోగాలను మూడు నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరంగల్ నుంచి మహబూబ్‌నగర్ వరకు తుక్కుగూడ సభకు కదలి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
KTR: నేతన్నలపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష..?: కేటీఆర్
ఖమ్మం: బీఆర్ఎస్ చేతగాని తనం వల్లే తెలంగాణలో నీటి ఎద్దడి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి, మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వర్షాకాలంలో పడిన వర్షాల కారణంగా వచ్చిన నీటిని వడిసి పట్టుకోకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు నీటిని ఎందుకు అందించడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయినా రాష్ట్రంలో నీటి సమస్య ఉండకూడదని యుద్ధ ప్రాతిపదికన పని చేసి నీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు.
14 ఎంపీ సీట్లు గెలుస్తాం
పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మల వలే పొలాల వెంట మాజీ సీఎం కేసీఆర్ తిరుగుతూ నీళ్లు అందించలేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దశాబ్ద కాలంలో కాంగ్రెస్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో గతంలో ఉన్నవారు కూడా కాంగ్రెస్ నాయకులేనని బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్‌కి పోటీనే కాదని భట్టివిక్రమార్క చెప్పారు.
Delhi liquor Scam: ‘కొడుకుకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం’.. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ
దేశంలో బీజేపీ పతనం మొదలైందన్నారు. యువత భవిష్యత్ దృష్ట్యా ఆచి తూచి ఓటు వేయాలని కోరారు. మనందరి భవిష్యత్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను, వనరులను అల్లకల్లోలం చేసిన దుర్మార్గపు పార్టీకి ప్రజలు గుణ పాఠం చెప్పారన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎవరినైనా ప్రశ్నించాలంటే భయం, రాయాలంటే భయపడే పరిస్థితుల నుంచి ప్రతి పౌరుడు ఓటు వేసి ఆ పార్టీని బొంద పెట్టారని చెప్పారు
. ప్రస్తుతం మీడియా వ్యవస్థ ఎలాంటి ఆంక్షలు లేకుండా వార్తలు రాయగలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పోటీ చేస్తున్న ప్రతి లోక్‌సభ స్థానంలో కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 30 వేల ఉద్యోగాలు ఎలా కల్పించామో, దేశంలో కూడా అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంట్ పొకున్నా పోయినట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడటం బాధాకరమని భట్టివిక్రమార్క అన్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు... సంచలన విషయాలు వెలుగులోకి..!
రాబోయే రోజుల్లో ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని కరెంట్ సమస్యలు రాకుండా మెరుగైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే తనతో పాటు ప్రతి మంత్రి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ వలే రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టం, పెట్టలేమన్నారు.
సీఎం రేవంత్ ఆ అడ్డంకులు తొలగించారు..
సీఎం, మంత్రులు ఎవరు ఢిల్లీ వెళ్లిన ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులు తీసుకు రావడానికేనని వివరించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కావాల్సిన పనులకు అడ్డంకులు ఉంటే సీఎం రేవంత్ వెంటనే ఆ అడ్డంకులు తొలగించారని చెప్పారు. 10 ఏళ్ల నుంచి అభివృద్ధి పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేస్తే వాటిని గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కేవలం మూడు నెలల్లో ఏ ఏ శాఖల్లో పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఖమ్మం జిల్లా సింగరేణి పుట్టిన ప్రాంతం, ఈ రోజు సింగరేణి గానీ, అత్యంత విద్యుత్ వెదజల్లే ప్రాంతమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా రవాణా ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పని చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి 6 గ్యారెంటీలు ప్రకటించామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. ఇప్పుడు అదే ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దేశంలో అమలు చేసే గ్యారెంటీల గురించి ఏఐసీసీ అగ్ర నేతలు ప్రకటిస్తారని అన్నారు. బహిరంగ సభను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి విజయవంతం చేయాలని భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.
Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 04 , 2024 | 08:08 PM