ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: అప్పులపై రాష్ట్రాలకు కేంద్రం స్వేచ్ఛనివ్వాలి

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:46 AM

అప్పులు తీసుకునే విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని, షరతులు, ఆంక్షలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

  • మూలధన వ్యయంలో రాష్ట్రాలకు ఏటా రూ.2.5 లక్షల కోట్లు ఇవ్వాలి

  • జైసల్మేర్‌లో జరిగిన కేంద్ర ప్రీ బడ్జెట్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అప్పులు తీసుకునే విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని, షరతులు, ఆంక్షలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగిన కేంద్ర బడ్జెట్‌ ముందస్తు సమావేశం(ప్రీ బడ్జెట్‌)లో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే అప్పులు తీసుకోవడంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని భట్టి అన్నారు. రాష్ట్రాల అప్పులపై ఆంక్షలు, షరతులను తొలగించాలని, అప్పుడే అవి ఆర్థిక పరిపుష్టిని సాధిస్తాయన్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, దేశీయ ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో మూలధన వ్యయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.


ఈ దృష్ట్యా... మూలధన వ్యయం కింద రాష్ట్రాలకు ప్రత్యేక సహాయంగా ఏటా రూ.2.5 లక్షల కోట్లను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రానికి జనాభా ఆధారంగా సీఎ్‌సఎ్‌సల నిధులను కేటాయించాలని, ఎలాంటి వివక్ష లేకుండా వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 94(2) ప్రకారం.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1800 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కోరారు. దేశ పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయాలని, ముఖ్యంగా ఆదాయ పన్నులో సంస్కరణలు చేపట్టాలని అన్నారు. జీఎ్‌సటీ, ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియను సులభతరం చేయాలని, పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ) ద్వారా కృత్రిమ మేధ(ఏఐ), ఎలకా్ట్రనిక్స్‌ వంటి ఆధునిక కోర్సులను అందిస్తూ, యువతలో నైపుణ్యాన్ని పెంచాలని అన్నారు. గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రతకు జాతీయ స్థాయి విధానాన్ని తీసుకురావాలన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 04:46 AM