ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘రైతుబంధు’లో 25 కోట్లు దుర్వినియోగం: భట్టి

ABN, Publish Date - Jul 31 , 2024 | 04:04 AM

పోడు భూములకు పట్టాలివ్వాలని పదేళ్లుగా పోరాటం చేస్తుంటే పోడు రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పడం సభను తప్పుదోవపట్టించడమేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు.

పోడు భూములకు పట్టాలివ్వాలని పదేళ్లుగా పోరాటం చేస్తుంటే పోడు రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పడం సభను తప్పుదోవపట్టించడమేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు. బడ్జెట్‌పై మంగళవారం శాసనసభలో చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లారాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ఒక పంట వేసే పోడు రైతులకు ఎస్సీ, ఎస్టీలకు గతంలో తమ ప్రభుత్వం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చిందన్నారు.

రాళ్లు రప్పలు, గుట్టలు, పుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు సైతం రైతుబంధు ఇచ్చి రూ.25వేల కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తేలిందనే విషయాన్ని భట్టి గుర్తుచేస్తూ.. సభను తప్పుదోవ పట్టించేలా పల్లా మాట్లాడుతున్నారని అన్నారు. పల్లా జోక్యం చేసుకుంటూ అత్యధిక శాతం చిన్న సన్నకారు రైతులకు సాయం అందిందన్నారు.

నిధుల దుర్వినియోగంపై మాట్లాడితే అప్పటి క్యాబినెట్‌లో పనిచేసిన ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యత ఉందన్నారు. తుమ్మల స్పందిస్తూ అప్పట్లో రైతుబంధు చైర్మన్‌గా పల్లాను నియమించడమే సరికాదన్నారు. యూనివర్సిటీ వీసీగానో... విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఉంటే బాగుండేదన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 04:05 AM

Advertising
Advertising
<