ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: ఎల్బీనగర్‌ నిధులను పాతబస్తీకి మళ్లించొద్దు..

ABN, Publish Date - Dec 19 , 2024 | 10:45 AM

ఎల్బీనగర్‌ పరిధిలో ప్రజల నుంచి పన్ను రూపేణ వసూలు చేస్తున్న నిధులను పాతబస్తీకి మళ్లించకుండా ఈ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy) డిమాండ్‌ చేశారు.

- బీఆర్‌ఎస్‌ మాదిరిగానే కాంగ్రెస్‌ పోకడలంటూ విమర్శ

- అధికారుల వైఖరిని నిరసిస్తూ జోనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

హైదరాబాద్: ఎల్బీనగర్‌ పరిధిలో ప్రజల నుంచి పన్ను రూపేణ వసూలు చేస్తున్న నిధులను పాతబస్తీకి మళ్లించకుండా ఈ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy) డిమాండ్‌ చేశారు. ఆరు నెలలుగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ జీహెచ్‌ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లంతా కలిసి జోనల్‌ కార్యాలయం ఎదుట బుధవారం పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన చేపట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు


జోనల్‌ కమిషనర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, వంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం సైతం ఎల్బీనగర్‌ జోనల్‌ పరిధిలో వసూలు చేసిన పన్నులను పాతబస్తీకి మళ్లించిందని, ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభు త్వం కూడా అలాగే వ్యవహరించడం దారుణమన్నారు. ఇలా నిధులు దారి మళ్లించడం ద్వారా శివారు ప్రాంతాలైన మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, నాగోల్‌, బీఎన్‌రెడ్డినగర్‌, వనస్థలిపురం, కొత్తపేట, గడ్డిఅన్నారం, చైతన్యపురి, సరూర్‌నగర్‌, ఆర్‌కేపురం తదితర డివిజన్లు అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు.


పది నెలలుగా వీధి దీపాల నిర్వహణ, సీసీరోడ్ల నిర్మాణపు పనులతో పాటు పారిశుధ్య నిర్వహణ సైతం సరిగ్గా చేపట్టలేని దుస్థితి నెలకొందన్నారు. జోనల్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని సంతోషించాము కానీ నిధులు కూడా మంజూరు చేయలేని దుస్థితి జీహెచ్‌ఎంసీలో నెలకొన్నదన్నారు. ఈ ప్రాంతంలో వసూలు చేసే పన్నులను పాతబస్తీకి మళ్లించకుండా ఈ ప్రాంతానికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు.


నిధులు కేటాయించలేనప్పుడు ప్రజల వద్ద పన్నులను కూ డా వసూలు చేయవద్దని వారు సూచించారు. అనంతరం వారు జోనల్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగ మధుసూదన్‌రెడ్డి, నాయకోటి పవన్‌కుమార్‌, చింతల అరుణాసురేందర్‌ యాదవ్‌, ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, రంగా నర్సింహగుప్తా, కళ్లెం నవజీవన్‌రెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, ఆకుల శ్రీవాణి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉ పాధ్యక్షుడు సురేందర్‌యాదవ్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన

ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు

ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2024 | 10:45 AM