BJP: రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. నేడు హస్తినకు బీజేపీ నేతలు..
ABN, Publish Date - Jun 06 , 2024 | 08:50 AM
ఇవాళ హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీకి వెళుతున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు సమావేశానికి హాజరుకానుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
ఢిల్లీ: ఇవాళ హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీకి వెళుతున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు సమావేశానికి హాజరుకానుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగింది. శుక్రవారం ఎంపీలుగా గెలుపొందిన పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అనంతరం తర్వాత మిత్రపక్షాల నేతలు వేరుగా భేటీ అవుతారు.
మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి.. ఏ పార్టీకి ఎన్ని పదవులివ్వాలో చర్చిస్తారు. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా త్వరత్వరగా ఈ ప్రక్రియ ముగించాలని చంద్రబాబు, నితీశ్ గట్టిగా సూచించినట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఈసారి హోంశాఖ కాకుండా వేరే శాఖను కేటాయించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రిపదవులు దక్కే అవకాశాలున్నాయని ఎన్డీయే వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. మోదీ కేబినెట్‌లో చేరాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.
NEET: నీట్ కౌన్సెలింగ్.. కన్వీనర్ కోటా అంత ఈజీ కాదు!
Read more Telangana News and Telugu News
Updated Date - Jun 06 , 2024 | 08:50 AM