TG Politics: బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలుతుంది: మహేశ్వర రెడ్డి
ABN , Publish Date - Mar 30 , 2024 | 02:18 PM
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మహేశ్వర రెడ్డి స్పందించారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు (BJP) కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మహేశ్వర రెడ్డి స్పందించారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీ హైకమాండ్‌తో తెలంగాణ మంత్రులు టచ్‌లో ఉన్నారని మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఐదుగురు మంత్రులు సంప్రదింపులు జరిపారని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పట్టడం లేదన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్ టచ్‌లో ఉన్నాడా..?
కాంగ్రెస్ పార్టీతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను మహేశ్వర రెడ్డి ఖండించారు. కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి టచ్‌లో ఉన్నాడో లేడో తెలుసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ చేత ఎందుకు విచారించడం లేదని మహేశ్వర రెడ్డి నిలదీశారు. రంజిత్ రెడ్డి భూములపై ఆరోపణలు చేశారు.. తర్వాత పార్టీలో చేర్చుకుని పక్కన కూర్చొబెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. టెలిఫోన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానిది అయినందున ఆ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
48 గంటలు
బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే స్థాయి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేదని మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి ఎంపీ సీటును వెంకట్ రెడ్డి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. చేరికలకు సంబంధించి బీజేపీ గేట్లు తీస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటలు కూడా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏక్‌నాథ్ షిండే పాత్ర పోషించడానికి చాలా మంది నేతలు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.
కొత్తగా ఆర్ ట్యాక్స్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆర్ టాక్స్ వసూల్ చేస్తున్నారని మహేశ్వర రెడ్డి ఆరోపించారు. ఆర్ అంటే రేవంత్, రాహుల్, రాజీవ్.. ఇందులో ఏ పేరుతో ట్యాక్స్ వసూల్ చేస్తున్నారో మాత్రం తెలియదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.1500 కోట్లు హైకమాండ్‌కు పంపించారని వివరించారు. మరో రూ.500 కోట్లు పంపించాల్సి ఉందని గుర్తుచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Telangana: బీఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న ఎమ్మెల్యే..!
Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..